భోపాల్: మధ్యప్రదేశ్‌లో సీటు చోరీ అంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బుధవారం ఖండించారు. రాజ్యసభ సీటుకు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కృతి వివాదానికి దారితీసింది. కాంగ్రెస్‌లోనే కొందరు పెద్దలు ఈ స్థానంలో కన్నేసి ఉంచారు. దీనితో పాపం నటరాజన్‌ను రానివ్వకుండా చేశారు. పైగా బిజెపిపై పాపం నెడ బడే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు. ఏమో ఆమె ఈ రాజ్యసభ స్థానం గెలిచి ఉండేవారేమో. అయితే కొందరు కాంగ్రెస్ నేతలే ఆమె అవకాశాలను దెబ్బతీశారని ఈ బిజెపి నేత స్పందించారు.
ఈ నెల 18న రాజ్యసభకు మధ్యప్రదేశ్ నుంచి జరిగే పోటీకి మీనాక్షి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఆమె అఫిడవిట్ సమగ్రంగా లేదని చెప్పారు. ఈ అంశంపై కాంగ్రెస్ భగ్గుమంది. ప్రజాస్వామ్య హత్య జరిగింది. కోర్టులో నిర్ధారించుకుంటామని. కాగా ఈ అంశంపై విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి యాదవ్ సొంత పార్టీ వారే ఉద్ధేశపూరితంగా, కుట్రతో వ్యవహరించి నామినేషన్ పత్రాలు చెల్లకుండా ప్రకటించారు. బడా నేతలకు ఈ సీటుపై ఆశ ఉంది. అయితే మీకు అని మీనాక్షి అడ్డంకి తెలిసి, ఆమెను బరిలోకి రాకుండా చేశారు, ఇదే కాంగ్రెస్ అంతర్గత సంస్కృతి, మహిళను ఎదగనివ్వకుండా పేర్కొన్నారు.

