ఏపీ అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రం ఏర్పాడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కేంద్రం నుంచి సాయం పుష్కలంగా ఉంది. దీనికి తాము కేంద్రానికి రుణపడి ఉంటాము. బీవీజీ రామ్‌జీ పథకం కింద.. 7 వేల కోట్ల రూపాయలు తాజాగా ఇచ్చారని తెలిపారు. దీనికి ముందు కూడా ఎక్కడా అన్యాయం జరగలేదని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను సక్రమంగా వినియోగిస్తున్నామని చెప్పారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు.
వైసీపీపై..
గత ప్రభుత్వం అంటూ.. వైసీపీపై పవన్ విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇచ్చిన సొమ్ములు ఎటు పోయాయో అంతు చిక్కడం లేదంటున్నారు. అన్ని రంగాలను గత ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. కేంద్రం నుంచి తెచ్చిన సొమ్ములతో అభివృద్ధి పనులు చేపడితే… ఇప్పుడు ఈ సమస్య ఉండేది కాదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలను అభివృద్ధి చేశామని.. దీనికి కేంద్రం ఇచ్చిన నిధులు కారణ’మని పేర్కొన్నారు. ప్రతి రూపాయినీ జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పంచాయతీ సర్పంచులకు.. చెక్ పవర్ ఇచ్చామని తెలిపారు. నిధులు కూడా అందించారు.
కూటమి పదిలం..
కూటమి ప్రభుత్వం పడిలంగా ఉందని పవన్ చెప్పారు. కొందరు కూటమిపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారిని గుర్తించామని తెలిపారు. మూడు పార్టీలు కలిసే ఉంటాయని అంటున్నారు. ప్రజలు కూడా సుస్థిర ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్రని మోడీ ప్రభుత్వం సహ’కారంతో సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో ముందుకు సాగుతున్నామ’న్న ఆయన.. ఏపీని ఓ రేంజ్‌కు తీసుకువెళ్లేందుకు చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని చెప్పారు. చిన్న చిన్న గొడవలు ప్రతి పార్టీలోనూ ఉన్నవేన ఇవి కూటమిని ఏమీ చేయలేకపోతున్నాయి. తమ లక్ష్యం స్వర్ణాంధ్ర సాకారమేనని పవన్ తెలిపారు.
పనితీరు బాగుంది..
కూటమి పార్టీల ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు బాగానే ఉందని పవన్ కలిసి. కొందరు చేసే పనులను అందరికీ ఆపాదించడం సరికాదన్నారు. దారి తప్పుతున్న’ వారిని హెచ్చరిస్తున్నామ’ని పేర్కొన్నారు. అందరూ మాట వింటున్న రని.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, రాజకీయ వైరుధ్యలు ఏపీలో లేవని తెలిపారు. అన్నీ బాగానే జరుగుతున్నాయ’ని చెప్పారు. ప్రతి ఒక్కరి సహకారంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.

