Allu Arjun And Pawan Kalyan: గత సంవత్సరం ఫ్యామిలీ గా మెగా ఫ్యామిలీ , అల్లు మధ్య కోల్పోయిన వార్ జరుగుతుందని , ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో గొడవలు జరిగాయి , ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో , మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి లేదని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పకనే చెప్తున్నారు మామ – అల్లుడు. వీళ్ళ మధ్య ఉన్న బ్యాండింగ్ , ప్రేమ వెలకట్టలేనిదని , బయట ఎంత మంది ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా పర్వాలేదని సోషల్ మీడియా లో కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి కలిసి , ఆయనతో మూడు గంటల పాటు సమయాన్ని గడిపి వచ్చాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే , రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురవ్వడం, దీంతో ఆయన ముక్కు కి కీలక సర్జరీ అవ్వడం జరిగింది. చాలా రోజుల పాటు ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా పక్కన పెట్టి , ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుంది, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్న సమయం లోనే అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఆయన ఇంటికి వెళ్లి , ఆయన్ని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారట అల్లు అర్జున్. ఆ సమయం లో ఫోటోలు తీయడానికి ఆయన అనుమతించలేదట. మా మధ్య ఉన్నటువంటి బంధాన్ని బయటకు తెలియజేయాల్సిన అవసరం లేదని , అది మా మధ్యనే ఉంటే చాలు అల్లు అర్జున్ అనుకున్నాడట. అందుకే ఫోటోలు తీసేందుకు అనుమతి ఇవ్వలేదని.
గతం లో కూడా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింపూర్ లో అగ్నిప్రమాదానికి సిద్ధమైనప్పుడు , అల్లు అర్జున్ తన సతీమణిరెడ్డి తో కలిసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పుడు మరోసారి ఆయన అదే పని చేశాడు , దీనిని బట్టీ వాళ్ళ మధ్య ఎలాంటి బంధం ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా సోషల్ మీడియా లో వీళ్లిద్దరి హీరోల అభిమానులు ఫ్యాన్ వార్స్ కావడం ఆపేస్తారో లేదో చూడాలి. వీళ్ళు లేటెస్ట్ గా కలిసిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చి ఉంటే బాగుండేదని అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

