నేడు నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ భారత్ మండపంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్ర అవసరాలకు సంబంధించిన ఈ సమావేశంలో చర్చించనున్నారు. నీతి ఆయోగ్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు అమరావతి బయలుదేరనున్నారు.

