హైదరాబాద్ క్రైమ్ న్యూస్ | హైదరాబాద్: భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. అత్యంత కిరాతకంగా ఆమె తలపై తుపాకీతో కాల్చి చంపాడు. ఈ హత్యకు అతడు దాదాపు 8 నెలల కిందటే ప్లాన్ చేశాడు. అందుకోసం ఈ ఏడాది జనవరిలో బిహార్ నుంచి ప్రత్యేకంగా తుపాకీని కూడా తెప్పించుకున్నాడు. కాల్పులు జరిపి హత్య చేయడానికి గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు. చివరకు బుధవారం తెల్లజామున భార్యపై కాల్పులు జరిపి హత్యచేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.
భార్య చెల్లెలితో అఫైర్.. రెండో వివాహం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్కాజిగిరి మారుతీనగర్‌కు చెందిన దామెర అరుణ్‌కుమార్(49) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు 2002లో స్వర్ణలత అనే మహిళతో వివాహమైంది. అయితే 2017లో జరిగిన ఒక ప్రమాదంలో కుమార్తె చనిపోవడం, అంతకుముందే భార్య క్యాన్సర్ బారిన పడి అరుణ్‌కుమార్ తన భార్య సోదరి అయిన నిషారాణి(38)కి దగ్గరయ్యాడు. ఆమెను హోటల్లో ఉంచి తరచుగా వెళ్లి కలుస్తున్నవాడు. ఈ విషయం తెలిసి భార్య స్వర్ణలత భర్తను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఇది కూడా చదవండి: Nandus World Nandu Controversy : నందూస్ వరల్డ్ నందు పాస్ పోర్ట్ డిస్మిస్? – ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు
ఈ 2022లో నిషారాణిని యాదగిరిగుట్టలో రెండో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం బాగానే సాగింది, ఆ తర్వాత నిషారాణిపై అరుణ్‌కుమార్‌కు అనుమానం మొదలైంది. ఆమె ఎప్పుడూ తన బంధువులతో ఫోన్ మాట్లాడుతోందని అనుమానం పెంచుకుని, శారీరకంగా వేధించాడు. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
ఎలాగైనా నిషారాణిని హత్య చేయాలని రియల్టర్ అరుణ్‌కుమార్ భావించాడు.. 2025 నవంబరులో తన ఫ్రెండ్ మహమ్మద్ అబ్బు సహాయంతో మీర్ ముజమ్మిల్, సల్మాన్ అనే వ్యక్తులను సంప్రదించాడు. వారి ద్వారా ఈ ఏడాది జనవరిలో బిహార్ నుంచి ఒక తుపాకీని తెప్పించుకున్నాడు. హైదరాబాద్ శివారులలో ఆ తుపాకీతో కాల్పులు కూడా ప్రాక్టీస్ చేశాడు. అయితే, మార్చి రెండోవారంలో అంబర్‌పేటలో వాహన తనిఖీల్లో తుపాకీతో సహా పోలీసులకు చిక్కడంతో జైలుకు వెళ్లాడు. భర్త జైలు పాలు కావడంతో నిషారాణి తిరిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది.
జైలుకు వెళ్లిన నెల రోజులకే బెయిల్‌పై బయటకు వచ్చిన అరుణ్‌కుమార్ రెండో భార్యను హత్య చేయడానికి ప్లాన్ చేశాడు. మళ్లీ బిహార్ నుంచి మరో తుపాకీని తెప్పించాడు. ఆ తర్వాత పెద్ద మనుషులతో మాట్లాడి, బంధువులను ఒప్పించి నిషారాణిని తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. బుధవారం (జూన్ 10న) తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ ఆవేశానికి లోనైన అరుణ్‌కుమార్, తను దాచిన తుపాకీ తీసి నిషారాణి తలపై 3 రౌండ్లు కాల్పులు జరపగా.. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పక్కన గదిలో ఉంటున్న అరుణ్‌కుమార్ తల్లి కాల్పుల శబ్దాలు విని బయటకు వచ్చి చూశారు. జరిగిన దారుణంపై పోలీసులకు సమాచారం అందించారు.
కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్కౌంటర్ – భారీ యాక్షన్ డ్రామా

