జాబ్ జీవితానికి చాలా ముఖ్యం.. జాబ్ లేనిదే డబ్బు రాదు… అయితే కొత్తగా ఉద్యోగం వచ్చిన తరువాత కొత్తగా ఆఫీసులోకి అడుగుపెట్టేందుకు ముహూర్త బలం చాలా ముఖ్యమని పండితులు అంటున్నారు. ఉద్యోగంలో ఏరోజు చేరాలి.. ఎప్పుడు చేరితే.. ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ముహూర్త చింతామణి గ్రంథంలో తిథి.. నక్షత్రం… వారానికి అనుగుణంగా ఏ రోజు ఉద్యోగంలో చేరాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
జ్యోతిష్య శాస్త్రం… హిందూ సాంప్రదాయ ప్రకారం ఏదైనా కొత్త పని మొదలు పెట్టే ముందు.. కచ్చితంగా పండితుల దగ్గర ముహూర్త బలం గురించి తెలుసుకుందాం. ఇంటి గృహప్రవేశం, పెళ్లి, వ్యాపార ప్రారంభం లాగానే ఉద్యోగంలో చేరేందుకు మంచి సమయం చూసుకుంటారు.
కొత్త ఉద్యోగంలో చేరేటప్పుడు కచ్చితంగా శుభ ముహూర్తం ప్రకారం జైన్. ఇంకా ఆరోజు దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండాఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోవాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.
ముహూర్త చింతామణి గ్రంథంలో ఉద్యోగం వంటి కార్యాక్రమాలకు అనుకూలమైన రోజుల వివరాలు ఉన్నాయి. ఈ గ్రంథం ప్రకారం విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి పూర్ణిమ తిథులు కలిగిన రోజుల్లో జాబ్ లో జాయిన్ అయితే మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ తేదీల్లో ప్రారంభించే పనులు దీర్ఘకాలం విజయవంతంగా కొనసాగుతాయని పండితులు చెబుతున్నారు.
అలాగే వారాల్లో సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం స్థిరత్వం, విజయాన్ని అందించే రోజులు. అశ్వని, పునర్వసు, పుష్యమి,హస్త, చిత్త, అనూరాధ, రేవతి నక్షత్రాలలో ప్రారంభమైన కార్యాలు చాలా కాలం నిలకడగా కొనసాగుతాయి. అభిజిత్ ముహూర్తం మరింత శక్తివంతమైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో చేసిన పనులు శాశ్వతంగా విజయవంతం అవుతాయని నమ్మకం.
మొదటి రోజు ఏం చేయాలి?
ఉద్యోగంలో చేరే తొలి రోజున ధరించే దుస్తులు కూడా శుభప్రదంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. నీలం రంగు దుస్తులు ధరించడం మంచిదని అంటారు. ఆఫీసులోకి వెళ్లే ముందు .. హెచ్ ఆర్ రూంలోకి వెళ్లే ముందు ఓం గం గణపతయే శాశ్విత” మంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
నిరాకరణ: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించి రూపొందించబడింది. ఈ జాబితా V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించారు. మీకున్న జ్యోతిష్య సమస్యల నిపుణులను సంప్రదించడం ఉత్తమం

