నిసర్గ్ అధికారి CBSE: మనం సాధారణంగా ప్రభుత్వ వెబ్ సైట్ లకు అత్యంత పట్టిష్టమైన ఫైర్ వాల్స్ ఉంటాయి కాబట్టి.. అందులో ఎటువంటి లోపాలూ ఉండవని అనుకుంటాం. అవి అత్యంత పటిష్టంగా పనిచేస్తాయనుకుంటాం. పైగా నిబంధనల వల్ల మనం ప్రభుత్వ సైట్ల జోలికి వెళ్లే సాహసం చేయం.. కానీ ఓ 19 సంవత్సరాల బాలుడు మాత్రం ఈ పని చేశాడు.
ఇటీవల సీబీఎస్ఈ మార్కుల అప్లోడ్ విధానంలో చోటు చేసుకున్న లోపాలను నిసర్గ అధికారి అనే యువకుడు బయటపెట్టాడు. భద్రతా లోపాలను కూడా అతడు వివరించాడు. అతడు బయటపెట్టిన మొత్తం తీరు చర్చకు దారి తీసింది. అనేకమంది ప్రముఖులు.. నెటిజన్ల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇతడి ప్రతిభను ఐఐటి కాన్పూర్ ప్రత్యేకంగా గుర్తించింది. అంతేకాదు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ.. సైబర్ డిఫెన్స్ పరిశోధన కేంద్రం C3iHub లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) , అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ గా ఉద్యోగం కల్పించింది.
నిసర్గ ఒక సాధారణ సైబర్ రీసెర్చర్. తన ప్రతిభతో దేశంలోనే హై ఎండ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధనలో ఉద్యోగం సాధించడం సాధారణ విషయం కాదు..C3iHub కాన్పూర్లో అతిపెద్ద సైబర్ సెక్యూరిటీ పరిశోధన కేంద్రం.. యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఇది పని చేస్తోంది.. సైబర్ దాడులు.. డేటా ప్రొటెక్షన్.. హ్యాపీ లాంటిదే ఇక్కడ ప్రతిరోజు పరిశోధనలు సాగుతూనే ఉంటాయి. గవర్నమెంట్.. బ్యాంకింగ్.. డిఫెన్స్ వంటి వాటికి డిజిటల్ ప్రొటెక్షన్ అందించడం.. సైబర్ అటాక్స్ నుంచి ముందుగానే కల్పించడం ఇతడి విధి.. ఈ డిపార్ట్మెంట్లో పని చేసే వారికి నెలకు 50 నుంచి 1.2 లక్షల వరకు వేతనం ఇస్తారు. అయితే నిసర్గ విషయంలో ప్యాకేజీ వేరే విధంగా ఉంటుంది. అతడికి ప్రతి నెలకు దాదాపు మూడు లక్షల వరకు ఇచ్చే అవకాశం కల్పిస్తోంది.
నేటి కాలంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హ్యాకర్లు కొత్త కొత్త విధానాలలో దాడులు చేస్తున్నారు. ఇలాంటి అప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. డేటా చోరీలు.. బెదిరింపులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. అందువల్లే నైపుణ్యం ఉన్న యంగ్ ఎక్స్పర్ట్స్కు డిమాండ్ ఉంది. ప్రభుత్వ విభాగాల్లో ఎత్తిచూపిన వారికి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. నిసర్గ కూడా అలానే అవకాశం దక్కించుకొని.. ఏకంగా ఈ స్థాయికి దాకా ఎదిగాడు.

