నేడు దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలు జరుగుతున్నాయి. చెన్నైలో భారతీ రాజా అంత్యక్రియలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారతీ రాజా చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించిన భారతీ రాజా మృతిపై ప్రముఖులు సంతాపం తెలిపారు.
ప్రభుత్వ లాంఛనాలతో…
నేడుప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు జరుగుతున్నాయి. వేలాది మంది అభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఈ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. భారతీ రాజా మృతి చలన చిత్ర రంగానికే తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

