మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు నామినేషన్ వేశారు. అయితే ఆమె అఫడవిట్ లో ఆస్తుల వివరాలతో పాటు తెలంగాణలో నమోదయిన కేసుల నమోదు కాలేదని తెలుపుతూ నామినేషన్ ను తిరస్కరించింది.
రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై…
దీంతో కేంద్ర ఎన్నికల అధికారులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏఐసీసీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు విచారణ జరపాల్సి ఉంది.

