బ్రిటన్‌లో కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న ఎంపీల నుంచి తీవ్ర తిరుగుబాటు ఎదురైంది. అంతకముందు ఎప్స్టీన్ వ్యవహారం కూడా యూకేలో కుదిపేసింది. దీంతో కీర్ స్టార్మర్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఇప్పుడు సొంత కేబినెట్ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
రక్షణ వ్యవహారాలకు సంబంధించి కీర్ స్టార్మర్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రక్షణ వ్యయాలపై నెలకొన్న తీవ్ర విభేదాల నేపథ్యంలో బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రపంచ భద్రతా పరిస్థితులు వేగంగా దిగజారుతున్నప్పటికీ బ్రిటన్ సైన్యానికి తగిన నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కీర్ స్టార్మర్‌కు రాసిన రాజీనామా లేఖలో హీలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ”నేను ఎప్పుడూ రాయాలని అనుకోని లేఖ ఇది.” అంటూ ప్రారంభించిన ఆయన.. ”తీవ్ర విచారం.. ఇష్టంలేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నాను.” అని పేర్కొన్నారు. ఇదే విషయంపై స్టార్మర్తో వాగ్వాదం ఉన్నట్లుగా.
వివాదానికి కారణమేంటి?
ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. బ్రిటన్ వ్యూహాత్మక రక్షణ సమీక్షలో ప్రతిపాదించిన లక్ష్యాలను అమలు చేయడానికి అవసరమైన నిధుల ప్రణాళిక ఇదే. అయితే తరబడి జరిగిన నెలల చర్చల అనంతరం కూడా ప్రభుత్వం అవసరమైన నిధులను కేటాయించేందుకు ముందుకు రాలేదని హీలీ. ముఖ్యంగా ప్రధాని కార్యాలయం, ట్రెజరీ (ఆర్థిక శాఖ) ప్రతిపాదించిన నిధులు దేశ భద్రతా అవసరాలకు ఏమాత్రం సరిపోవని. ప్రణాళిక ప్రకారం రక్షణ వ్యయం 2030 నాటికి జీడీపీలో 2.68 శాతం మాత్రమే చేరుతుందని.. ఇది సరిపోదని హీలీ ప్రస్తుత అభిప్రాయపడ్డారు. ఇక తన లేఖలో హీలీ అత్యంత ఘాటుగా స్పందించిన అంశం రష్యా ముప్పుపై స్టార్మార్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడం.
ఇటీవల రష్యా 2030 నాటికి నాతో భూభాగాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని స్టార్మర్ హెచ్చరించిన గుర్తు చేసిన హీలీ.. అలాంటి ప్రమాదాల గురించి ప్రభుత్వం మాట్లాడుతూ.. వాటిని ఎదుర్కొనే స్థాయిలో నిధులు కేటాయించడం లేదని గుర్తు చేశారు. ”రక్షణ రంగానికి ఏమి అవసరమో మీకు తెలుసు. కానీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైన పెట్టుబడి ప్రణాళిక లేకుండా నేను తీసుకోవాల్సిన నిర్ణయాలు సైనికుల సన్నద్ధతను తగ్గిస్తాయి. విధుల్లో ఉన్న సిబ్బందికి ప్రమాదాన్ని పెంచుతాయి.” అని లేఖలో పేర్కొన్నారు.
నెలలుగా విభేదాలు
గత కొన్ని నెలలుగా రక్షణ శాఖ, ఆర్థిక ప్రధాని శాఖ, కార్యాలయ మధ్య నిధుల విషయంలో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. సమీక్షలో ప్రతిపాదించిన లక్ష్యాలకు, అందుబాటులో ఉన్న నిధులకు మధ్య బిలియన్ల పౌండ్ల లోటు ఉందని రక్షణ అధికారులు ఇప్పటికే హెచ్చరించినట్లు సమాచారం. ఈ కారణంగానే డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పలుమార్లు వాయిదా పడింది. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే బ్రిటన్ సైన్యాధిపతి కూడా నేరుగా ప్రధాని స్టార్మర్‌కు లేఖ రాసి రక్షణ రంగానికి కేటాయిస్తున్న నిధులు సరిపోవని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ పరిస్థితుల మధ్య రాజీనామా
జాన్ హీలీ బ్రిటన్‌కు అత్యంత కీలక సమయంలో రాజీనామా చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతు, రష్యాపై పెరుగుతున్న ఆందోళనలు, నాటో సభ్య దేశాలపై రక్షణ వ్యయాలను పెంచాలన్నా, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు వంటి పరిణామాల మధ్య ఈ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక స్టార్మర్ ప్రభుత్వం సైన్యాన్ని అందించడానికి తగిన నిధులు కేటాయించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
రాజకీయ సంక్షోభంగా వివాదం
ఇప్పటి వరకు కేవలం విధానపరమైన వివాదంగా కనిపించిన ఈ అంశం.. హీలీ రాజీనామాతో పూర్తిస్థాయి రాజకీయ సంక్షోభంగా మారింది. దీంతో బ్రిటన్ రక్షణ వ్యూహం, జాతీయ భద్రత, సైనిక వ్యయాలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామం స్టార్మర్‌కు మరింత రాజకీయ ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

