రాజ్ కేసిరెడ్డి అరెస్ట్: ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో కుంభకోణం జరిగింది. వేల కోట్ల అక్రమ వ్యవహారం ఐదు సంవత్సరాలపాటు దర్జాగా సాగిపోయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం మీద దృష్టిసారించింది.. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థకు సమాచారం అందించింది. ఇందులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి ప్రవేశించింది. ఆ కీలక తర్వాత ఆధారాలు సేకరించి.. చర్యలు తీసుకుంటున్నారు.
మద్యం కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ రాజ్ కే సి రెడ్డి ని అరెస్ట్ చేసింది. ఇతడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా వ్యవహరించారు. గతంలోనే రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం ఇతడిని అరెస్ట్ చేసింది. ఏడాది పాటు జైల్లో ఉంచింది. ఇటీవల ఇతడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. మళ్లీ ఇప్పుడు మనీలాండరింగ్ వ్యవహారంలో కీలక ఆధారాలు సేకరించిన కేంద్ర దర్యాప్తు బృందం.. ఇతడిని అరెస్ట్ చేసింది.
లిక్కర్లో హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్లోని 10 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు బృందాలు భారీగా సోదాలు జరుగుతున్నాయి. రాజ్ కేసిరెడ్డి హైదరాబాదులోని నానక్ రామ్ గూడ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా వ్యవహరించిన కారుమూరు నాగేశ్వరరావు.. అతని కుమారుడు సునీల్.. వాసుదేవ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
నాడు మద్యం వ్యవహారంలో ఏకంగా 349 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డారని.. ఆ డబ్బులను మొత్తం పేరు, ఊరు లేని కంపెనీలకు తరలించాలని.. అనంతరం వాటిని స్థిరాస్తి రంగంలో పెట్టుబడిగా పెట్టారని కేంద్ర దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అనే కంపెనీని వాడుకొని.. దాని వెనక రాజ్.. సిండికేట్ వ్యాపారులు 95 ఏళ్లకు పైగా లాభాలను హవాలా మార్గంలో.. మనీలాండరింగ్ మార్గాల్లో భారీగా స్థిరాస్థిరంగంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఓల్ వీక్.. ఆరోయో.. ఈజీ లోడ్ వంటి డమ్మీ కంపెనీలను ఏర్పాటు చేసి.. భారీగా నిధులను అందులోకి పంపించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘ విచారణ సాగించారు. అనంతరం కీలక నాటి ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడంతో.. ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. రాజ్ కేసిరెడ్డి గురించి విజయసా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అతడే సూత్రధారి అంటూ. నాడు జగన్ సూచనలు చేయడంతో సజ్జల శ్రీధర్ రెడ్డికి 100 కోట్ల వరకు సర్దుబాటు చేయాల్సి వచ్చిందని విజయసాయిరెడ్డి ఏకంగా ఈడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అది వైసిపి కి భారీ దెబ్బగా మారింది.
ఈ మద్యం వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు అధికారులు 441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. అంతేకాదు వారి నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ డేటా ప్రకారం జగన్మోహన్ రెడ్డికి తదుపరి నోటీసులు ఇస్తారని. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి డిస్ట్రిక్ట్రీల నుంచి దాదాపు 350 కోట్ల లంచాలు వసూలు చేసినట్లు సమాచారం. అయితే హవాలా.. ఇతర లావాదేవీలను ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ బద్దలు కొట్టడంతో ఈ స్కాం వెనుక ఉన్న అసలు సూత్రధారులు భయపడిపోతున్నట్టు తెలుస్తోంది.
రాజ్ కేసిరెడ్డిని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి. లిక్కర్ వ్యాపారానికి సంబంధించి జే బ్రాండ్ పేరుతో నాసిరకమైన మద్యాన్ని విక్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. ఇలా సంపాదించిన డబ్బుతో అక్రమ వ్యాపారాలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు లీకుల ప్రకారం త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అందే అవకాశం ఉంది.

