Published on: 11:37 am, 12 జూన్ 2026
ట్రూ అప్ అంటే తెలుసు కదా. విద్యుత్ వినియోగంలో వినియోగంపై ఆయా ప్రభుత్వాలు ఎప్పుడో వాడిన విద్యుత్ కు… చాలా కాలం తర్వాత వసూలు చేసే అధిక చార్జీలు. ట్రూ అప్ అమలు చేస్తున్నారంటే… మనం గతంలో వాడిన విద్యుత్ పై పెరిగిన బిల్లులను ప్రస్తుత వినియోగంతో కలిపి కట్టడమన్నమాట. ఏపీలో వైసీపీ హయాంలో ఐదేళ్ల వ్యవధిలోనే ఏకంగా 9 సార్లు ట్రూ అప్ చార్జీలను వసూలు చేశారు. మరి రెండేళ్ల పాలనలో ఇది అమలు అయ్యిందా? అంటే… లేదనే చెప్పాలి. ట్రూ అప్ మాటెత్తని కూటమి.. ఏకంగా ట్రూ డౌన్ వరాలను ప్రజలకు అందించింది.
అయినా ట్రూ డౌన్ అంటే ఏమిటన్న విషయానికి వస్తే… ట్రూ అప్ అంటే చార్జీల పెరుగుదల కదా. అలాగే ట్రూ డౌన్ అంటే విద్యుత్ చార్జీల తగ్గుదల అన్నమాట. గతంలో మనం వినియోగించిన విద్యుత్ కు అప్పుడే బిల్లులు కట్టి ఉంటాం కదా. నాడు మనం కట్టిన బిల్లులు ఎక్కువని బావించిన కూటమి ప్రభుత్వం… ఆ బిల్లులను తగ్గిస్తూ ట్రూ డౌన్ అమలు చేస్తోంది. అంటే… అప్పుడు మనం కట్టిన అధిక బిల్లులను ఇప్పుడు మనం వాడిన విద్యుత్ బిల్లులో నుంచి తగ్గిస్తామన్న మాట. ప్రస్తుత యూనిట్ కు రూ.13 పైసల చొప్పున ట్రూ డౌన్ చార్జీలను అమలు చేసేందుకు వీలుగా ఇందన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
ట్రూ అప్ పేరుతో ప్రజల నుంచి ఎప్పుడో వాడిన విద్యుత్ కు ఆ తర్వాత అధిక బిల్లులంటూ వసూలు చేసిన చరిత్ర వైసీపీది అయితే… ప్రజలు ఎప్పుడో వాడిన విద్యుత్ కు అదిక బిల్లులు చెల్లించారని భావించి ఇప్పుడు బిల్లులు తగ్గిస్తున్నట్లు చరిత్ర కూటమిదని గొట్టిపాటి చెబుతున్నారు. ఆ కూటమి రెండేళ్ల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ బిల్లులు పెరగలేదన్న ప్రతిపాదనకు మంత్రి…రానున్న మూడేళ్లలో విద్యుత్ చార్జీలను పెంచబోమంటూ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.
ఒక్క విద్యుత్ బిల్లుల్లోనే ఈ మేర మార్పులను తీసుకొచ్చిన కూటమి… సంక్షేమ పాలన అందించిందని చెప్పక తప్పదు కదా అని కూడా గొట్టిపాటి లాజిక్ తీశారు. పాలనకు రెండేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఓ వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైసీపీ ఆందోళనలకు దిగిన శుక్రవారమే మంత్రి గొట్టిపాటి.. ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ అంటూ వివరాలు వెల్లడించి విపక్షానికి షాక్ ఇచ్చారని చెప్పాలి. ఐదేళ్లలో రెట్టింపు 9 సార్లు పెరిగితే… గడచిన రెండేళ్లలో చార్జీలను పెంచడంతోపాటు ఎప్పుడో వాడిన విద్యుత్‌కు అధిక చార్జీలు వసూలు చేశారంటూ ట్రూ డౌన్ పేరుతో చార్జీలను తగ్గించడం నిజంగా సంక్షేమ పాలనకు నిదర్శనమని చెప్పక తప్పదు.

