370 బిర్యానీ గై Vs సెజల్ పవార్: సోషల్ మీడియాను కుడిపేస్తున్న గురుగ్రామ్ టెక్కీ హిమాన్షు జంగ్రా రూ. 370 బిర్యానీ వివాదం చల్లారకముందే.. కమెడియన్ ప్రణీత్ మోరేకు చెందిన అదే స్టాండప్ కామెడీ క్రౌడ్-వర్క్ షో నుంచి మరో షాకింగ్ వీడియో బయటకు వచ్చి నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈసారి వివాదంలో చిక్కుకుంది ఒక సాధారణ వ్యక్తి కాదు.. సమాజంలో దైవంతో సమానంగా చూసే వైద్య వృత్తిలో ఉన్న ముంబైకి చెందిన లేడీ డాక్టర్ సెజల్ పవార్. మరణించిన వ్యక్తుల శరీర భాగాలపై ఆమె హాస్యం పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి, నెటిజన్ల అసహ్యానికి దారితీశాయి.
ఈ కామెడీ షోలో డాక్టర్ సెజల్ పవార్ మాట్లాడుతూ.. తాను, తన స్నేహితులు మెడికల్ కాలేజీలో అనాటమీ క్లాస్ ల్యాబ్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న పురుషుల శవాల ప్రైవేట్ వస్తువుల పరిమాణాన్ని తనిఖీ చేస్తూ సరదాగా మాట్లాడుకునేవాళ్లమంటూ నవ్వుతూ చెప్పింది. అంతటితో ఆగకుండా, ప్రాక్టికల్స్ చివర్లో తామంతా కలిసి పురుషుల శవాల ముఖ్యమైన జననాంగ భాగాలను కట్ చేసేవాళ్లమంటూ అత్యంత అసహ్యకరమైన రీతిలో జోక్ చేసింది. మరణించిన తర్వాత కూడా మానవ శరీరానికి ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని దిగజార్చేలా ఒక కాబోయే వైద్యురాలు ఇలా మాట్లాడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇది సెజల్ పవార్ ముంబైలో డాక్టర్
– ఆమె ప్రణిత్ మోర్ షోకి వచ్చింది & ఆమె మరియు ఆమె స్నేహితులు మృతదేహాల D పరిమాణాలను ఎలా తనిఖీ చేస్తారనే దాని గురించి చమత్కరించారు
– అప్పుడు వారు చివరిలో మగ శరీరాల్లోని ప్రధాన భాగాన్ని ఎలా కత్తిరించారో ఆమె చమత్కరించింది.
– మరణంలో మానవ శరీరాలను దిగజార్చడం
-రూ. 370 బిర్యానీ గై హిమాన్షు జంగ్రా… pic.twitter.com/zZ41ghcHlJ— రోజీ (@rose_k01) జూన్ 10, 2026
ఈ వీడియో వైరల్ కావడంతో నెట్టింట జెండర్ బయాస్, డబుల్ స్టాండర్డ్స్ పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రూ. 370 బిర్యానీ తినిపించి అమ్మాయి నుంచి ఆసక్తి ప్రయోజనాలు ఆశించిన హిమాన్షు జంగ్రాను అందరూ అసహ్యించుకుని, ఉద్యోగం ఊడబీకేలా ట్రోల్ చేసారు.. మరి శవాలను, పురుషుల శరీర భాగాలను ఇంత దారుణంగా అవమానించిన ఈమె కేవలం ఒక అమ్మాయి అయినందుకు నెటిజన్లు ఎందుకు లైట్ తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. తప్పు ఎవరు చేసిన తప్పేనని, మెడికల్ ఎథిక్స్ ను మరుగైన ఈమెపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.
ఈ విమర్శల దాడి తీవ్రం కావడంతో మెడికల్ నుంచి చర్యలు ఉంటాయనే భయంతో డాక్టర్ సెజల్ పవార్ తక్షణమే స్పందించారు. ఆమె ఒక సుదీర్ఘ వీడియో ద్వారా సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు, ముఖ్యంగా మెడికల్ కమ్యూనిటీకి బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఆ షోలో కేవలం నవ్వుల కోసమే, కమెడియన్ అడిగిన ఫ్లోలో తాను అలా మాట్లాడానని.. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తనకు లేదని కన్నీళ్లు పెట్టుకుంది. వృత్తి పట్ల తనకు అత్యంత గౌరవం లేదని, తన వ్యాఖ్యలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లు.
స్టాండ్-అప్ షోలో శవాలపై పురుషుల ప్రైవేట్ భాగాల గురించి స్పష్టమైన జోకులు వేసినందుకు డాక్టర్ సెజల్ పవార్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. తర్వాత ఆమె “అమాయకురాలు” అని చెప్పి క్షమాపణ చెప్పింది.
మెడికల్ ఎథిక్స్ యొక్క షాకింగ్ ఉల్లంఘన?#డాక్టర్ వివాదం #మెడికల్ ఎథిక్స్ #వైరల్వీడియో #StandUpComedy pic.twitter.com/dqpSOwk837
— UnMuteINDIA (@LetsUnMuteIndia) జూన్ 11, 2026
హాస్యం అనేది ఒకరిని నవ్వించడానికి ఉండాలి కానీ.. చనిపోయిన వారిని, లేదా ఒకరి జెండర్‌ను అవమానించేలా ఉండకూడదని ఈ రెండు వరుస వివాదాలు నిరూపించాయి. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం, కమెడియన్ల చప్పట్ల కోసం యువత ఎంతలా దిగజారుతుందో చెప్పడానికి హిమాన్షు జంగ్రా, డాక్టర్ సెజల్ పవార్ ఉదంతాలే నిలువెత్తు నిదర్శనాలు. క్షమాపణలు చెప్పడానికి, ఒక డాక్టర్ నోటి నుంచి వచ్చిన ఆ వ్యాఖ్యలు వైద్య రంగానికే మచ్చ తెచ్చేలా ఉన్నాయంటూ నెటిజన్లు ఇప్పటికీ ఆమె వీడియో కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

