నేడు తెలంగాణలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:30కు మండవ ప్రభాకర్‌రావు ఇంటికి రాజ్‌నాథ్ చేరుకుంటారు. అనంతరం డి.ఆర్.డి.ఎల్ లో రాజ్‌నాథ్ సింగ్ పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
మేధావులతో సమావేశం…
ఈరోజు హైదరాబాద్ లో సాయంత్రం నాలుగు గంటలకు మేధావులతో సమావేశం అవుతారు. ప్రధాని నరేంద్ర మోదీ పన్నెండేళ్ల పాలనపై వివరించడమే కాకుండా, మేధావులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30కు ఎయిర్‌ఫోర్స్ అకాడమీ అధికారులతో భేటీ కానున్నారు.

