జస్పాల్ రానా: మనదేశంలో ప్రసిద్ధ షూటర్ జస్పాల్.. ఎన్నో మెడల్స్ సాధించాడు.. మన దేశానికి తిరుగులేని ఖ్యాతిని అందించాడు.నేడు షూటింగ్‌కి ఎంతోమంది క్రీడాకారులు వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం జస్పాల్. తను ఆటగాడిగా దేశానికి ఎన్నో మెడల్స్ అందించాడు.. అంతేకాదు ఎంతోమంది షూటర్లకు తను ఇప్పుడు షూటింగ్ నేర్పిస్తున్నాడు. కేవలం షూటర్ గా తన బాధ్యతను.. శిక్షకుడిగా తన అనుభవాన్ని నేర్పించే పనిలోపడ్డాడు.
ఒలంపిక్స్ లో మెడల్ సాధించిన మను భాకర్ కు జస్పాల్ శిక్షకుడిగా కొనసాగుతున్నాడు. ఆమె మెడల్ సాధించడంలో ఎంతో కీలకపాత్ర పోషించాడు. 49 సంవత్సరాల వయసులో ఉన్న జస్పాల్ ఆకస్మాత్తుగా కన్నుమూయడం ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేసింది.. అతడు చనిపోవడం భారత క్రీడా లోకం జీర్ణించుకోలేకపోతోంది.. జర్మనీలోని మ్యూనిచ్ ప్రాంతంలో ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ పోటీలను పూర్తి చేసుకొని భారత బృందం తిరిగి వస్తోంది. ఈ నేపథ్యంలో జస్పాల్ విమానంలోనే తీవ్ర అస్వస్థతకు సిద్ధమైంది.
విమానం ఢిల్లీకి చేరిన వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత అతని గుండె శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే నాలంలో అడ్డంకి ఏర్పడిన నేపథ్యంలో.. వైద్యులు దానిని గుర్తించి తొలగించారు. స్టంట్ అమర్చారు. కొద్దిరోజుల తర్వాత మరో స్టంట్ వేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. జస్పాల్ కోలుకున్నాడని.. అతడి పరిస్థితి నిలకడగా ఉందని అందరూ అనుకున్నారు. అయితే గురువారం అతడి పరిస్థితి మరోసారి విషమించింది. ఈసారి అతని గుండె పని చేయడం మానేసింది. ఫలితంగా జస్పాల్ కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.
ముందుగా అతడు తన చాతిలో నొప్పి వస్తే.. దానిని అజీర్తి సమస్య అనుకున్నాడు.. అప్పుడే నొప్పి వచ్చినప్పుడు ఆసుపత్రికి ఉంటే బతికి బట్ట కట్టేవాడు. గత ఫిబ్రవరి ఏడాదిలో జాతీయ కోచ్ గా జస్పాల్ నియమితుడైనాడు. 25 మీటర్ల పిస్టల్ పట్టా హై పెర్న్స్ కోచ్ గా అతడు బాధ్యతలు తీసుకున్నాడు. జస్పాల్ ఉత్తరాఖండ్‌లో జన్మించాడు. 1994లో షూటింగ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. అదే సంవత్సరం హీరోషిమ ఆసియా గేమ్స్ లో స్వర్ణం, కాంస్యం గెలిచాడు. 2026 ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించాడు.
1994 నుంచి 2006 వరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 9 స్వర్ణాలు, రజత, రెండు కాంస్య మెడల్స్ సాధించాడు.. కేవలం 18 సంవత్సరాల వయసులోనే అర్జున అవార్డు అందుకున్నాడు. 21 సంవత్సరాల వయసులోనే పద్మశ్రీ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. ఇతడి ట్రైనింగ్ లోనే మను బాకర్ 2024 పారిస్ ఒలంపిక్స్ లో రెండు కాంస్యాలు ఉన్నాయి. 2020లో జస్పాల్ ద్రోణాచార్య అవార్డు దక్కించుకున్నాడు.

