Nitish Kumar Reddy : అప్పట్లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కుమార్ కుమార్ ఆటగాడు నితీష్ రెడ్డి సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా జట్టు మీద అద్భుతమైన పోరాటం చేసి అదరగొట్టాడు. ఎంతమంది దిగ్గజ ప్లేయర్ల నుంచి ప్రశంసలు అందుకున్నారు. రవి శాస్త్రి.. సునీల్ గవాస్కర్ లాంటి ప్లేయర్లు అతని ఆట తీరును గొప్పగా వర్ణించారు.. ఇలాంటి ఆట తీరు ఇకపై కూడా కొనసాగాలని అతడికి సూచించారు.
ఆస్ట్రేలియా జట్టు మీద సెంచరీ చేసిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టులో కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు. అతడు ఆడే విధానం సరికొత్తగా ఉండటంతో జాతీయ జట్టులో వరుసగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతున్న 3డేల సిరీస్‌లో అతడికి ఆడే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డి వచ్చిన అవకాశాలను సద్వినియో గించారు. అంతేకాదు 2027 వన్డే వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకొని ఆడుతున్నాడు.
నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేయగలడు. బౌలింగ్ కూడా చేయగలడు. ఇక ఫీల్డింగ్ అయితే మెరుపుతీగ లాగా కదులుతూ ఉంటాడు. జట్టులో ఆటగాళ్లకు అతడు అజాతశత్రువుగా ఉంటాడు. అందువల్లే అతడికి విస్తృతంగా అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డి సమావేశంలో మాట్లాడారు. ధర్మశాల వేదికలో విజయం సాధించిన తర్వాత అతడు విలేకరులతో సరదాగా మాట్లాడాడు. అతడు విలేకరులతో మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది అతడి తల్లి. అంతమంది విలేకరులు మాట్లాడుతూ వారందరినీ ఆగమని.. ఫోన్ ఎత్తాడు. అమ్మ ఐదు నిమిషాలు ఆగి చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ విలేకరుల సమావేశం కొనసాగుతుంది. విలేకరులకు క్షమాపణలు కూడా చెప్పారు. దానికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ జట్టు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నితీష్ కుమార్ రెడ్డికి తన తల్లి అంటే విపరీతమైన ఇష్టం. అందువల్లే అతడు ఆమెకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తూ ఉంటాడు. ఇటీవల తనకు నచ్చిన కారు కొనుగోలు చేశాడు. ఆ కారులో తన తల్లిని ముందు సీట్ లో కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడు. అంతేకాదు తన ఫేవరెట్ మహేష్ బాబు కొనుగోలు చేసిన రంగు కారునే.. నితీష్ కొనుగోలు చేయడం విశేషం. అంతేకాదు ఆ కారును తల్లితో కలిసి డ్రైవింగ్ చేయడం. నితీష్ కుమార్ రెడ్డి ఆడే మ్యాచ్ లకు అతడి తల్లిదండ్రులు ఇద్దరు హాజరవుతారు. అతడి సోదరి మైదానంలో మరింత సందడి చేస్తూ ఉంటుంది.
నితీష్ కుమార్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైనప్పుడు ఆయన తల్లి ఆయనకు ఫోన్ చేసింది. ❤️ pic.twitter.com/fwyoE8z7va
— ముఫద్దల్ వోహ్రా (@mufaddal_vohra) జూన్ 13, 2026

