IND vs PAK : మహిళల టి20 వరల్డ్ కప్లో భాగంగా భారత జట్టు పాకిస్థాన్ తో తలపడుతోంది. ఇంటిలోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.. టాస్ గెలిచిన భారత మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మైదానం మీద తడబడుతున్న భారత బ్యాటర్లు.. మరోసారి అదే ఇబ్బందిని ఎదుర్కొన్నారు. భీకరమైన ప్లేయర్గా పేరుపొందిన షపాలి వర్మ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి సాదిబా ఇక్బాల్ బౌలింగ్లో ఔట్ అయింది. కీలకమైన వన్ డౌన్ ప్లేయర్ జమీమా రోడ్రిగ్స్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి తస్మియా బౌలింగ్లో అవుట్ అయింది.
కేవలం 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో.. పాకిస్థాన్ బౌలర్లు మ్యాచ్ మీద పూర్తి స్థాయిలో పట్టు బిగించారు.. పాకిస్థాన్ బౌలర్లలో ఇక్బాల్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేసింది. తస్మియా కూడా పదునైన బంతులు వేసింది. దీంతో భారత్ పరుగులు తీయడానికి చాలా కష్టపడింది. భారత బ్యాటర్లలో స్మృతి.. కెప్టెన్ కౌర్ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తున్నారు. పాకిస్థాన్ బౌలర్లు రెచ్చిపోయిన చోట.. అనవసరమైన షాట్లకు వెళ్లకుండా ఆడుతున్నారు. వీరిద్దరూ ఈ కథనం రాసే సమయం వరకు మూడో వికెట్ కు 66 పరుగులు జోడించారు. భారత జట్టు 11.4 ఓవర్లలో 7.2 రేటు చొప్పున 84 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో భారత జట్టు తన పంతాన్ని నెగ్గించుకుంది. పాకిస్తాన్ దేశంతో ద్వైపాక్షిక సిరీస్ లను భారత పురుషుల జట్టు ఆడటం లేదు. భారత మహిళల జట్టు కూడా అదే భారత పురుషులను కొనసాగిస్తోంది.. అంతేకాదు, పాకిస్థాన్ జట్టు పాకిస్థాన్ ఆటగాళ్లతో కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం లేదు.. కప్ లో టాస్ ప్రక్రియ తర్వాత ఒక్కసారి కూడా భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ట్రోఫీ గెలిచిన తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ నుంచి కప్ అందుకోవడానికి కూడా భారత ప్లేయర్లు ఇష్టపడలేదు. ప్రస్తుతం భారత మహిళలు కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. కనీసం భారత జట్టు కెప్టెన్ పాకిస్థాన్ కెప్టెన్ తో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే భారత కెప్టెన్ వెను తిరిగారు.
పాకిస్తాన్ పదే పదే భారతదేశం మీద ఉగ్రదాడులకు యత్నిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పెద్దల నిర్ణయాన్ని పాటిస్తున్నారు. కొంతమంది కుహనా మేధావులు క్రికెట్లో ఈ పోకడలు ఏంటని ప్రశ్నించారు.. ఉగ్రవాదులతో ఎంత దూరం ఉంటే అంత మంచిదని భారత అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి భారత మహిళలు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మరొకసారి చర్చకు దారి తీసింది.

