INDA vs SLA : ఐపీఎల్ 19వ సీజన్లో చితక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ(21) భారత జెర్సీతో మాత్రం విఫలమయ్యాడు. పవర్ ప్లేలోనే ఏ రెండు బిగ్ వికెట్లు కోల్పోయింది.
INDA vs SLA : ఐపీఎల్ 19వ సీజన్లో చితక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ(21) భారత జెర్సీతో మాత్రం విఫలమయ్యాడు. ముక్కోణపు సిరీస్లో శ్రీలంక ఏ బౌలర్లను ఉతికేస్తాడనుకుంటే సులువుగా వికెట్ ఇచ్చేశాడీ హిట్టర్. మరో ఓపెనర్ ప్రభసిమ్రన్ సింగ్(11) కూడా డగౌట్ చేరడంతో పవర్ ప్లేలోనే ఏ రెండు భారీ వికెట్లు కోల్పోయాయి.
ముక్కోణపు సిరీస్ మూడో మ్యాచ్లో భారత ఏ జట్టుకు శుభారంభం దక్కలేదు. శ్రీలంక ఏ బౌలర్లను ఉతికేసి భారీ స్కోరందిస్తారనుకుంటే ఓపెనర్లు తేలిపోయారు. ఐపీఎల్లో రికార్డు శతకంతో రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ(21), మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన ప్రభసిమ్రన్ సింగ్(11)లు విఫలమయ్యారు. తన మార్క్ విధ్వంసంతో చెలరేగాలనుకున్న వైభవ్ను సమన్ అరాచిగే ఔట్ చేశాడు.
🚨 వైభవ్ సూర్యవంశీ శ్రీలంకపై 21 (14) పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
14 (12) vs SL
44 (22) vs AFG
21 (14) vs SLఈ సిరీస్లో అతను 3 ఇన్నింగ్స్ల్లో 79 పరుగులు మాత్రమే చేశాడు మరియు లాఫ్టెడ్ షాట్లు ఆడుతూ అవుట్ అయ్యాడు.
అతను ఓపిక కలిగి ఉండాలి మరియు గ్రౌన్దేడ్ షాట్లు ఆడటం నేర్చుకోవాలి; లేకపోతే, అతను… pic.twitter.com/I6yaOBkpmT
— భారత క్రికెట్ మంత్రిత్వ శాఖ (@ICM_News45) జూన్ 15, 2026
కాసేపటికే షిరాజ్ ఓవర్లో ప్రభసిమ్రన్ వెనుదిరగతో వద్ద భారత ఏ జట్టు 39 వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ తిలక్ వర్మ(13), రుతురాజ్ గైక్వాడ్(23)లు ఇన్సైడ్ నిర్మించే బాధ్యత నిర్మించారు. 13 ఓవర్లకు స్కోర్ 70-2.

