ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో శుభారంభం చేసింది. దాయాదీ పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్ సమష్టిగా రణించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 64 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో భారత్ దుమ్మురేపింది. మరోవైపు పాకిస్థాన్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్థాన్ బౌలర్ ఫాతిమా సనా కొట్టుకున్నట్లుగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్‌పై దూసుకొచ్చిన పాక్ బౌలర్ ఫాతిమా నోటికి పనిచెప్పగా.. ఆగ్రహంతో ఊగిపోయిన హర్మన్ ప్రీత్ కౌర్ ఆమె మెడపట్టుకొని నెట్టేయగా.. ఇతరత్రా దూసుకొచ్చింది. అంపైర్లు జోక్యం చేసుకునేందుకు సర్ది చెప్పినట్లుగా ఈ వీడియో ఉంది.
ఫేక్ వీడియో..
అయితే ఇది ఫేక్ వీడియో అని తేలింది. కొందరు ఆకతాయిలు కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)సాయంతో ఈ వీడియోను సృష్టించారు. ఈ వీడియోను నిశితంగా పరిశిలిస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. ఈ వీడియోలోని స్కోర్ కార్డ్స్‌తో పాటు భారత్‌ను పరుగెత్తుకురావడం వంటి సీన్స్ ఇది నకిలీ వీడియో అని స్పష్టం చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్‌లో కూడా ఇది ఫేక్ వీడియో అని తేలింది.
ఫోటో క్రెడిట్: X (twitter)
అయితే ఇది ఫేక్ వీడియో అని తెలియని నెటిజన్లు నిజమేనని పొరబడి కామెంట్స్ చేస్తున్నారు. పాక్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్, పాక్ మధ్య ఉన్న వైరాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు ఆకతాయిలు ఈ వీడియోను సృష్టించారు. అయితే నిన్న జరిగిన మ్యాచ్‌లో మధ్య ఎలాంటి గొడవ జరగలేదు.
#INDvsPAK : భారత్ వర్సెస్ పాకిస్థాన్ షోడౌన్ సందర్భంగా హర్మన్‌ప్రీత్ కౌర్ మరియు ఫాతిమా సనా షేక్ కొన్ని ఘాటైన మాటలు మార్చుకున్నారు. 😤
ఇప్పుడు PAKకి 37 బంతుల్లో 83 పరుగులు అవసరం మరియు 6 W డౌన్ 🤣 pic.twitter.com/apN8PrxK08
— ఇండియన్ వైర్ (@TheIndianWiree) జూన్ 14, 2026 ">

