- స్లోవేకియాలో మోడీ పర్యటన
- 33 ఏళ్ల తర్వాత మోడీ టూర్
- ఇరు దేశాల మధ్య చర్చ
స్లోవేకియాలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. 33 ఏళ్ల తర్వాత స్లోవేకియాలో నిలిచిన ప్రధాని మోడీనే కావడం విశేషం. 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీ ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రాటిస్లావా నగరంలో మోడీకి స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఘన స్వాగతం పలికారు. అనంతరం చారిత్రాత్మక బ్రాటిస్లావా కోటలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని సోషల్ మీడియా వేదికగా సూచన.. “ప్రతిష్ఠాత్మకమైన బ్రాటిస్లావా కోటాను నాకు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రధాని ఫికోకు ధన్యవాదాలు. భారత్-స్లోవేకియా స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు మేము కలిసి పనిచేస్తూనే ఉంటాం” అని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడంపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ భారత్-స్లోవేకియా సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. అలాగే అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీ కూడా మోడీ కలవనున్నారు.
పర్యటన ప్రారంభంలో స్లోవేకియా కళాకారులు ‘వందే మాతరం’ ఆలపించి భారత సంస్కృతికి గౌరవం ఇచ్చారు. అలాగే స్థానిక సంగీత బృందం ప్రాచీన సంస్కృత శ్లోకాలను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యూరప్ గడ్డపై భారత ఆధ్యాత్మిక సంప్రదాయాలను సంరక్షించి ప్రదర్శించినందుకు మోడీ వారిని ప్రశంసించారు.
స్లోవేకియా యూరోపియన్ యూనియన్ సభ్య దేశం కావడంతో ఈ పర్యటనలో భారత్-ఈయూ సంబంధాల బలోపేతానికి కీలకంగా ఉంది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాను సందర్శించారు. స్లోవేకియా పర్యటన అనంతరం ప్రధాని మోడీ ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. జూన్ 16, 17 తేదీల్లో జరిగే జీ7 సదస్సులో పాల్గొని ప్రపంచ ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ సహకారం, కృత్రిమ మేధస్సు (AI) వంటి అంశాలపై ప్రపంచ నేతలతో చర్చలు నిర్వహిస్తారు. అనంతరం జూన్ 18న పారిస్‌లో జరిగే యూరప్‌లో అతిపెద్ద టెక్నాలజీ, ఇన్నోవేషన్ సదస్సులలో ఒకటైన వివాటెక్ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సదస్సులో అభివృద్ధి సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు గురించి ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి.
Členovia súboru Lúčnica zaspievali počas privítania v Bratislave pieseň వందేమాతరం.
Prichádza to v čase, keď si pripomíname 150 rokov od vzniku piesne వందేమాతరం a jej významný prínos k dejinám Indie ak boju za jej slobodu. pic.twitter.com/SjRSBEnSug
– నరేంద్ర మోదీ (@narendramodi) జూన్ 15, 2026
ప్రాజెక్ట్ మహాదేవ కీర్తన ప్రాజెక్ట్ je chvályhodnou iniciatívou, ktorá poukazuje na pretrvávajúce kultúrne putá medzi Indiou a Slovenskom.
Včera v బ్రాటిస్లేవ్ సోమ్ బోల్ స్వెడ్కోమ్ వైస్ట్పెనియా టోహ్టో సుబోరు. Je obdivuhodné, ako hlboko sa inšpirujú indickými duchovnými tradíciami,… pic.twitter.com/KmUH3zo3o3
– నరేంద్ర మోదీ (@narendramodi) జూన్ 15, 2026
ఐకానిక్ బ్రాటిస్లావా కాజిల్ వద్ద సాదర స్వాగతం పలికినందుకు నేను ప్రధాన మంత్రి ఫికోకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్-స్లోవేకియా స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు మనం కలిసి పని చేస్తూనే ఉంటాం.@RobertFicoSVK pic.twitter.com/8552LodfUG
– నరేంద్ర మోదీ (@narendramodi) జూన్ 15, 2026

