ప్రభాస్ ఫాజీ టీజర్ అప్డేట్: రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ ఈ ఏడాది డిసెంబర్ 3న విడుదల చేసేందుకు మేకర్స్ రూపొందిస్తున్నట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. అయితే ఇప్పటి వరకు మేకర్స్ అధికారిక ప్రకటన రాలేదు. అసలు ప్రభాస్ వెర్షన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యిందా లేదా అనే విషయం పైన కూడా ఎలాంటి అప్డేట్ లేదు. ఫ్యాన్స్ లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. మరోపక్క ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ అయిపోయాడు. మరి ‘ఫౌజీ’ సంగతేంటి , అసలు ఈ సినిమా ఉందా లేదా అనే అనుమానం అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యం లో ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న లేటెస్ట్ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
మేకర్స్ రీసెంట్ గానే ఈ చిత్రం సంబదించిన టీజర్ కట్ వర్క్ ని మొదలు పెట్టారట. జులై చివరి వారంలో , లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ టీజర్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు చూపుతుంది. కొంతమంది జులై మొదటి వారంలో కూడా ఈ టీజర్ విడుదల అవ్వొచ్చని అంటున్నారు. దీనిని బట్టీ చూస్తుంటే వచ్చే నెలలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కచ్చితంగా రాబోతుంది అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. అయితే ఈ చిత్రం ఆర్మీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఒక లవ్ స్టోరీ కావడంతో , ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తే , రీచ్ వేరే లెవెల్ లో ఉంటుందా?, మేకర్స్ ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయడం లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఏడాది ఆరంభం లో ‘రాజా సాబ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రమైన నిరాశకు’ చిత్రం. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది అనే బాధ ఒకవైపు , సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ ని మానసిక వేదనకు ఉపయోగించేలా చేసింది. ఇలాంటి సమయం లో వాళ్లకు ఒక సూపర్ హిట్ సినిమా రావడం తప్పనిసరి. అందుకే ‘ఫౌజీ’ చిత్రం ఎట్టి పరిస్థితిలోనూ సూపర్ హిట్ అవ్వాలని అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు. మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందా లేదా అనేది , వచ్చే నెలలో విడుదల అవ్వబోయే టీజర్ తో ఒక క్లారిటీ అయితే రాబోతుంది .

