ఫెన్సింగ్ ఆసియా కప్: వండే వరల్డ్‌కప్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన భారత్ మరో క్రీడా సంబురానికి వేదిక. ప్రతిష్ఠాత్మక ఫెన్సింగ్ ఆసియా కప్(ఫెన్సింగ్ ఆసియా కప్) హక్కులు దక్కించుకుంది.
ఫెన్సింగ్ ఆసియా కప్: వండే వరల్డ్‌కప్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన భారత్ మరో క్రీడా సంబురానికి వేదిక. ప్రతిష్ఠాత్మక ఫెన్సింగ్ ఆసియా కప్(ఫెన్సింగ్ ఆసియా కప్) హక్కులు దక్కించుకుంది. జూన్ 19 నుంచి 24 వరకు ఢిల్లీలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఫెన్సింగ్ ఆసియా కప్ టోర్నీ ఢిల్లీలో జరపడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఆసియా ఫెన్సింగ్ కాన్ఫెడరేషన్ 39వ సాధారణ సమావేశం కూడా జరుగనుంది.
ఫెన్నింగ్స్లో వార్షిక ఛాంపియన్‌షిప్‌గా పేరొందిన ఆసియా కప్ మరో మూడు రోజుల్లో భారత్‌లో మొదలవ్వనుంది. ఆసియాతో పాటు మధ్య, దక్షిణ ఫసిఫిక్ ప్రాంతంలోని ఫెన్సర్లు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటో.. సత్తా చాటిన వాళ్లను నేరుగా ఆసియా క్రీడలకు ఎంపిక చేయనున్నారు. అంతేకాదు ఫెన్సర్లకు ర్యాంకింగ్స్ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా.. 2028లో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం లభించనుంది.
చారిత్రాత్మక ఆసియా సీనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లను 2026లో నిర్వహించేందుకు భారతదేశం సర్వసన్నద్ధమైంది #న్యూఢిల్లీ జూన్ 19 నుండి జూన్ 24, 2026 వరకు.
ఈ స్మారక కార్యక్రమం భారతదేశం ఖండాంతర స్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి.
ఫెన్సింగ్ యొక్క “ఆసియా కప్”గా విస్తృతంగా గుర్తింపు పొందింది,… pic.twitter.com/dCxXIcRXDU
— DD న్యూస్ (@DDNewslive) జూన్ 15, 2026
ఫెన్నింగ్ ఆసియా కప్ నిర్వహించడం భారత్‌లో క్రీడాభివృద్ధికి సంకేతమని భారత ఫెన్సింగ్ సంఘం(FCA) సెక్రెటరీ జనరల్ రాజీవ్ మెహతా అన్నారు. ‘దేశంలో మొదటిసారి సీనియర్ ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లు నిర్వహించడం కీలకమైన ముందడుగు. ప్ర పంచ స్థాయి ఫెన్సర్లను ఆహ్వానించడంతో పాటు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028 సన్నద్ధతకు శ్రీకారం చుడుతున్నాం. ఈసారి ఆర్టిఫీషియ’ల్ ఇంటెలిజెన్స్ వీడియో రెఫరల్ వ్య’వస్థను ఉపయోగిస్తున్నాం. ఒలింపియన్ భవానీ దేవీతో కూడిన 24 మంది భారత ఫెన్సర్ల బృందం పోటీ పడనుంది’ అని రాజీవ్ వెల్లడించారు.

