హైదరాబాద్: ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ భూరికార్డుల అధికారిని ఏసీబీ అరెస్ట్ చేసింది. దాదాపు 16 గంటల పాటు ఏసీబీ అధికారుల సోదాలు జరిపారు. నరహరి ఇంట్లో రూ.1.54 కోట్ల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది.
నరహరి బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. రూ. 5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను పేర్కొన్నారు. కేజీ 300 గ్రాముల బంగారం, 8 కిలోల వెండిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నరహరి ఆస్తుల చిట్టా చూస్తే సామాన్య జనం విస్తుపోవాల్సిందే.
రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో వ్యవసాయం భూమి, పుప్పాలగూడలో హైరైజ్ బిల్డింగ్, నార్సింగిలో రెండు ఆస్తులు హైరైజ్ బిల్డింగ్, రాజేంద్ర నగర్లో మరో హైరైజ్ బిల్డింగ్, గచ్చిబౌలిలో అధికారులు G+3 బిల్డింగ్, ఛత్రినాకలో G+2 బిల్డింగ్, ఛత్రినాకలో G+2 వేల కోట్ల రూపాయలకు 10 లక్షల రూపాయలు. పేర్కొన్నారు. నరహరి స్థిరాస్తుల విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం 13 కోట్లకు నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగానే ఉండొచ్చని ఏసీబీ స్పష్టం చేసింది.

