‘మంగళవారం’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ఘట్టమనేని తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమవుతుండగా, బాలీవుడ్ యువ నటి రాషా తడానీ ‘ఉయ్ అమ్మ’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వాత టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మాణం ఈ అశ్వినీదత్ సమర్పిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. తాజాగా చిత్ర బృందం మూడో సింగిల్ ‘గుండె పేలిపోతోందే’ పాటను విడుదల చేశారు. తొలి ప్రేమలో కలిగే మధురమైన భావోద్వేగాలను ఆవిష్కరించే ఈ పాట, ఓ యువకుడు తొలిచూపులోనే ఓ అమ్మాయిపై ప్రేమలో పడిన తర్వాత అతని మనసులో కలిగే ఉత్సాహం, ఆశ్చర్యం, ఆనందాన్ని అందంగా చూపిస్తుంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ పాటకు క్లాసిక్, మోడరన్ మెలోడీతో మేళవిస్తూ అద్భుతంగా కంపోజ్ చేశారు.
ఆస్కార్ విజేత గేయ రచయిత చంద్రబోస్ రాసిన సాహిత్యం తొలి ప్రేమ అమాయకత్వాన్ని అద్భుతంగా పలికించగా, అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. హీరో జయకృష్ణ ఘట్టమనేని తన నేచురల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, రాషా తడానీ సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించింది. వీరిద్దరి మధ్య కనిపించిన ఫ్రెష్ కెమిస్ట్రీ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘శ్రీనివాస మంగాపురం జూలై 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల.

