పెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రామన్నగూడెం స్టేజీ సమీపంలోని రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి. రెండు కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జుగా మారాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. మృతులు ప్రకాశ్ రావు, సాయికుమార్, థామ్సయ్యగా పేర్కొన్నారు. అతివేగంగా రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

