ఆంధ్రప్రదేశ్:దేవుడిని భక్తులు వివిధ కోరికలు కోరుకుంటారు.కానీ, అనంతపురం జిల్లా ఆత్మకూరు(ఆత్మకూర్ ) మండలం పంప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత ఘటన వెలుగుచూసింది.గురువారం ఆలయ హుండీని లెక్కించగా,ఓ రూ.20 నోటుపై ‘స్వామి.మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను,ఆమె త్వరగా చనిపోయేలా చూడు’ అని రాసి ఉన్న వినతి కనిపించింది.ఈ వింత కోరికను చూసి అధికారులు భక్తులు వేలేసుకున్నారు.

