తెలంగాణ:రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం బేగంపేట గ్రామంలో రూ.17 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 6.2 డబుల్ లెన్ రహదారి (డబుల్ లేన్ రోడ్ )అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డితో( కిషన్ రెడ్డి ) కలిసి రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని అభివృద్ధి పనులను చేపట్టారు.
బేగంపేట–ఎలిమినేడు–మాదాపూర్ మార్గాన్ని ఆధునికీకరించే ఈ ప్రాజెక్టు ద్వారా రహదారి విస్తరణతో పాటు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి.

