హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని రాయదుర్గంలో దారుణం జరిగింది. వన్ సైడ్ లవ్ పేరుతో ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. వన్ సైడ్ లవ్ పేరుతో యువతిని వెంటపడి వేధించాడు. యువతి కాదనే ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చేతికి తీవ్రంగా గాయమైంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏండ్ల బస్తీ ఊర పోచమ్మ ఆలయం దగ్గర ఘటన జరిగింది.
ఎండ్ల కృతిక(20) అనే యువతిని ప్రేమ పేరుతో కంచమీది గోవర్ధన్(22) అనే యువకుడు వేధించాడు. శుక్రవారం సాయంత్రం పక్కింటి బిల్డింగ్ మీద నుంచి బాధితురాలు ఇంటి రెండవ అంతస్తులోకి నిందితుడు అక్రమంగా ప్రవేశించాడు. కత్తితో ఇంట్లోకి చొరబడ్డాడు. మొదట యువతి అక్క గొంతుపై కత్తి పెట్టి బెదిరించాడు.
దీనిని గమనించి అడ్డుకోబోయిన యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు, కాపాడటానికి వచ్చిన బాబాయ్‌పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. బాధితుల కేకలతో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
►ఇంకా చదవండి |ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. నార్సింగి అల్కాపూర్ టౌన్షిప్లో భయాందోళనలు
గాయాలు పాలైన వారిని హాస్పిటల్ పోలీసులు. గాయపడిన వారం అపాయం నుంచి బయటపడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “హైదరాబాద్ రాయదుర్గంలో దారుణం.. వన్ సైడ్ లవ్ పేరుతో ఉన్మాది ఘాతుకం”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

