హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్ షిప్ ఏరియాలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మహిళకు గాయాలయ్యాయి. అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 9లో శుక్రవారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన కలకలం రేపింది.
స్థానికంగా ఉన్న బిల్డింగ్‌లోని మూడో అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో నివాసం ఉంటున్న గీత(40) ఇంటి బాల్కనీలో ఉంచిన హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ ఆకస్మికంగా పేలడంతో బాల్కనీ గోడ కొంత భాగం ధ్వంసం అయింది. పేలుడు ప్రభావంతో గోడ శిథిలాలు ఆమె కాళ్లపై పడడంతో గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు, వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపిన విషయం తెలిసిన వెంటనే నార్సింగి, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
►ఇంకా చదవండి | ఈ ఊరిలో రెండు నెలల్లో 15 మంది చచ్చిపోయారు..
ఈ ప్రమాదంలో మరెవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలుడు గల కారణాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. ఘటనతో అల్కాపూర్ టౌన్షిప్లో కొద్దిసేపు భయాందోళనలు నెలకొన్నాయి.

