విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్ ధర్మవరం అధ్యాపకులకు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు ప్రశంస పత్రాలు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాలకు చెందిన అధ్యాపకులు శ్రీ బాలాజోషి, శ్రీ కిరణ్ కుమార్ శ్రీ చక్రపాణి రెడ్డి, డా. మల్లికార్జున, కళ్యాణి , అనూష 2026 వ సంవత్సరం నుండి అమలులోకి వచ్చే పాలిటెక్నిక్ సిలబస్ సీ-26 తయారీలో ముఖ్యభూమిక పోషించారు. ఈ సందర్భంగా వారి కృషి కి అభినందిస్తూ ఉన్నత విద్యా శాఖ సంచాలకులు, మంగళగిరి వారి నుండి ప్రశంశ పత్రాలు అందజేసారు. . కళాశాలలో ఉండే అధ్యాపకుల నుండి 6 మంది ఇంతటి గొప్ప కార్యక్రమములో పాల్గొనడం ఏంత గర్వంగా ఉందని వారు సంతోషాన్ని వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో శాఖాదిపతులు బాలస్వామి, డా. హరిబాబు, కార్యాలయ పర్యవేక్షకులు సుశీల ఉన్నారు.

