– ప్రకటన –
నవతెలంగాణ-నవాబు పేట
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుంది అని ఎంఈఓ నాగ్య నాయక్ అన్నారు. మండల పరిధిలోని చౌడూరు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులు, తల్లిదండ్రుల మీటింగ్కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ సర్పంచ్ కోట సునీత అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేందుకు తీర్మానం చేశామని తెలిపినందున వారిని ఎంఈఓ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంఈ నాగయ్య నాయక్ మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలోని పాఠశాలలను వదిలి,ఇరుకు గదులు ప్రైవేటు పాఠశాలకు వెళ్లడం లేదని, పాఠశాలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని, పూర్వ ప్రాథమిక పాఠశాలలకు కూడా కృషి చేస్తానని చెప్పారు. అనంతరం గ్రామ సునీత మాట్లాడుతూ తమ గ్రామంలో విద్యార్థులు మన పాఠశాలకే పంపేందుకు తీర్మానం చేస్తామని ఇట్టి తీర్మానాన్ని పాటించని వారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేయడం జరుగుతుందని, ఇట్టి తీర్మానాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.
ప్రైవేటు పాఠశాలకు వెళుతున్న మొత్తం 14 మంది విద్యార్థుల విద్యార్థుల్లో కుమార్, ఆచారి, మల్లేష్, నరేందర్, రాజేందర్ గౌడ్ మొదలైన వారితో మాట్లాడి అక్కడికక్కడే ఏడు మంది విద్యార్థులను మన పాఠశాలలో చేర్చారు.తెలిపారు.జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, పాఠశాల ప్రాథమిక ప్రధానోపాధ్యాయురాలు నాగమల్లిక, గ్రామ సెక్రెటరీ మాధవి అలీ,కోట ఆంజనేయులు, అమ్రేష్, నరేందర్ కొనసాగుతున్నారు.
– ప్రకటన –

