మేషం
మేష రాశి వారికి ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా లాభాలు కూడా బాగుంటాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. రుణదాతల నుండి రావలసిన ధనం చేతికి అందుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగస్తులకు చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. భూ సంబంధిత విష వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సంతానం యొక్క చదువు కోసం ఖర్చులు పెరుగుతాయి. నర దిష్టి ఎక్కువగా ఉంటుంది. ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృషభం
వృషభ రాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వివాదాలకు సంబందించి విలువైన విషయాలు శేఖరిస్తారు. రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి. కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంతానం యొక్క విద్యా విషయాలకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంతో కాలంగా ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. అమ్మవారికి కస్తూరి పసుపుతో మంగళవారం కానీ శుక్రవారం కానీ అభిషేకం చేయండి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా ఎసిడిటీ. ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మిధునం
మిధున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.
ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేసిన పనులలో శ్రమ తప్పదు. ప్రభుత్వ సంబంధిత విషయాలు కొలిక్కి వస్తాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. గృహమున కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ప్రారంభమునకు అవాంతరాలు తప్పవు. నూతన గృహం కొనుగోలు చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. మొగలి పువ్వు కుంకుమతో ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. శనివారం రోజున నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రణాళికలు రూపొందించుకుని క్రమపద్ధతిలో పనులు పూర్తి చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సినీ కళా రంగంలో ఉన్నవారికి అంతా అనుకూలంగా లేదు. నిత్యవసర సరుకులు అమ్మేవారికి పాల వ్యాపారస్తులకు నీళ్ల వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు బాగుంటాయి. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరులతో ఆస్తి వాదనలు పరిష్కారమౌతాయి. సంతానం యొక్క విద్యా విషయాలకు ధనం అధికంగా ఖర్చు అవుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి తగ్గుతుంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో లక్ష్మీ తామర వత్తులు కలిపి దీపారాధన చేయండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 4 కలిసివచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సింహం
సింహ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది, వ్యాపారమునకు కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుతాయి. దివ్యశ్రీ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. సంఘంలో విశిష్ఠ గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. రాశి వారు ప్రతి రోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. మంగళవారం మరియు శుక్రవారం రోజు అమ్మవారికి కస్తూరి పసుపుతో అభిషేకం చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్య
కన్యారాశి వారికి వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. మీకు ఎంతో కాలంగా ఒక అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. నలుగురిలో మీకంటూ ఒక దానిని ఏర్పరచుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఎంతోకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. నూతన వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య కలిసివచ్చే రంగు లైట్ గ్రీన్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తుల
తులా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నవి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్త వింటారు. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు లేదా ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు సొంతంగా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. మొగిలి పువ్వు కుంకుమ ఆరావళి కుంకుమతో అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేయండి. రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి వారం వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఏదైనా ఒక ప్రారంభిస్తే దానిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ముఖ్య విషయాలలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. గతంలో మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ మరింత పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. తొందరపడి వాగ్దానాలు చేయవద్దు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. సంతానం యొక్క విద్యా విషయాలకు ధనం అధికంగా ఖర్చు అవుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు ప్రతి నిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఆరావళి కుంకుమ మొగలి పువ్వు కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనస్సు
ధనస్సు రాశి వారికి చాలావరకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. పెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశీయానం చేస్తారు. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి సాధించారు. నలుగురిలో ప్రత్యేకంగా కనబడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. పాతబాకీలు వసూలవుతాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులు చేసే ఉద్యోగాలు ఫలిస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవివాదాలు పరిష్కారం అవుతాయి. నూతన వాహన యోగమున్నది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మకరం
మకర రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
చేసిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. బంధువులతో విభేదాలు సర్దుమణుగుతాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేసిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బ్యాంకు లోన్లు అందుతాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి జీవిత భాగస్వామి సలహాల సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఆరవలి కుంకుమ మొగలి పువ్వు కుంకుమతో అమ్మవారికి అభిషేకం చేయండి. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే మూడు సంఖ్యలు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభం
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపార పరంగా లాభాల కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. సమస్యలు అనారోగ్య బాధిస్తాయి. స్ధిరాస్తి వివాదాలకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలి. దూర ప్రాంత ప్రయాణాలు అత్యవసరమైతేనే చేయండి. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. భాగస్వామ్య వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నర దిష్టి ఎక్కువగా ఉంటుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ఉద్యోగాలలో ఇతరుల కొన్ని ఇబ్బందులు తప్పవు. శనివారం రోజున నలుపు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు మెరున్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మీనం
మీన రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తున్నప్పటికీ మంచి అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన గృహం కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రభుత్వపరంగా రావలసిన ధనం చేతికి అందుకుంది. సంతానం యొక్క విద్యా విషయాలకు ధనం అధికంగా ఖర్చవుతుంది. చేసిన పనులు సజావుగా సాగుతాయి. వాహన కొనుగోలు చర్యలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. అఘోర పాశుపత హోమం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు నీవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

