Pakistan Terrorism Links: ప్రస్తుతం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. పాకిస్థాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ మీద దారుణంగా విరుచుకుపడుతోంది. ఆఫ్ఘనిస్తాన్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం తీవ్రంగా చోటుచేసుకుంటున్నది. ముఖ్యంగా చిన్నారులు.. వృద్ధులు ఎక్కువగా చనిపోతున్నారు.
పాకిస్తాన్ పదే పదే దాడి చేయడం.. అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్ కూడా గట్టిగా సమాధానం చెబుతోంది. ఇటీవల పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో దాడులు జరిగాయి. రాత్రిపూట వైమానిక దాడులు కూడా చేసింది. వైమానిక దాడులు చేస్తే భారీగా ఖర్చు అవుతుందని భావించిన ఆఫ్గనిస్తాన్.. ఈసారి ఏకంగా సరికొత్త ప్రణాళిక రూపొందించింది. దీంతో పాకిస్థాన్ కు దిమ్మ తిరిగిపోయింది.
పాకిస్థాన్ కీలకమైన కైబర్ పంక్తుక్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేసింది. డ్రోన్లతో పాకిస్తాన్ దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఐసిస్, లస్కరే తోయిబా వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదుల శిబిరాలు ఆఫ్ఘనిస్తాన్ దాడుల్లో నేలమట్టమైనట్టు గుర్తించింది. ఆఫ్ఘనిస్తాన్ దాడులకు ఇక్కడి నుంచే ప్రణాళికలు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద గ్రూప్లతో కలిసి ఆఫ్గనిస్తాన్ దేశం మీద దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇన్నాళ్లపాటు పాకిస్థాన్ ఈ పర్యవేక్షణ చాలా రహస్యంగా ఉంచింది.. ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్స్ తో దాడులతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. దీనిని అంతర్జాతీయ సమాజం ముందు ఆఫ్ఘనిస్తాన్ ఆధారాలతో సహా ఉంచింది. దీంతో పాకిస్థాన్ దేశానికి మరోసారి అంతర్జాతీయంగా తలవంపులు ఎదురయ్యాయి. ఇప్పటివరకు ఉగ్రవాదులతో సంబంధం లేదన్నట్టుగా పాకిస్థాన్ వ్యవహరిస్తూ ఉంటుంది. అదేవిధంగా బుకాయింపులకు దిగుతూ ఉంటుంది. కానీ, ఆఫ్ఘనిస్తాన్ చేసిన డ్రోన్ దాడులతో.. పాకిస్థాన్ ఉగ్రముఖ చిత్రం మరోసారి బయటపడింది. మరి అంతర్జాతీయ సమాజం ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.

