ఫొటో షూట్ చేస్తూ లోయలో పడిన యువకుడు
పూణె: వివాహబంధంతో ఒక్కటై నూరేళ్లు కలిసి బతకాల్సిన ఓ యువజంట జీవితాలను ప్రీ వెడ్డింగ్ సరదా విషాదభరితంగా మార్చింది. ఫొటో షూట్ చేస్తూ నవ వరుడు మృతి చెందాడు. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. కాబోయే నవవధువు పుట్టినరోజు కావడంతో వరుడు కేతన్ విశాల్ అగర్వాల్ (26) గురువారం ఉదయం ఆమెను సరదాగా చారిత్రాత్మక లోహగఢ్ కోటకు తీసుకువెళ్లాడు. వారి వెంట వారి సన్నిహిత మిత్రులను తీసుకువెళ్లారు. కోట వద్ద ఆ సమయంలో పొగమంచు కమ్ముకుని, యువతి ఫొటోలు తీస్తున్న కేతన్ హోరుగాలికి 400 అడుగుల లోతులో పడి అక్కడికక్కడే మరణించాడు. పూణె సమీపంలోని ఘనంజే స్థాపించిన కేతన్ తన కుటుంబ స్థిరాస్తి వ్యాపార కంపెనీలో డైరెక్టరుగా ఉన్నాడు. నవంబరులో జరిగేలా నిశ్చయించిన ఈ జంట పెళ్లి కోసం ఉదయ్‌పూర్ ప్యాలెస్ బుక్ చేశారు.

