వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులు జరుగుతున్నాయి. లెబనాన్ తమ హిజ్బుల్లా మిత్రపక్షాలను తక్షణమే అదుపులోకి తీసుకురావాలని ఇరాన్‌కు సూచించారు. లేదంటే ఈసారి దాడులు భయంకరంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
”లెబనాన్‌లో ఇబ్బందులు సృష్టిస్తున్న తమ ప్రాక్సీలను ఇరాన్ వెంటనే ఆపాలి. ఒకవేళ వారు చేయకపోతే గత వారం చేసినట్లే ఈసారి మరింత తీవ్రంగా ఇరాన్‌పై మళ్లీ దాడి చేస్తాం” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో రాసుకొచ్చారు. ఓ వైపు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతోన్న వేళ.. మరోవైపు ట్రంప్ ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.
స్విట్జర్లాండ్‌లో చర్చలు ప్రారంభం:
అమెరికా, ఇరాన్ మధ్య పీస్ డీల్‌కు సంబంధించి ఈ వారంలో ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెష్కియాన్ ఎంవోయూపై సంతకాలు కూడా చేశారు. ప్రాథమిక ఒప్పందంలోని అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ బృందాలు స్విట్జర్లాండ్ వేదికగా చర్చలు జరుపుతున్నారు.
ఇందులో భాగంగానే ఆదివారం (జూన్ 21) స్విట్జర్లాండ్ వేదికగా ఇరుదేశాల మధ్య తుది దశ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా తరుఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీట్ విట్ కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్.
►ఇంకా చదవండి |స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం
ఇరాన్ తరుఫున స్పీకర్ మహ్మద్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అటెండ్ అయ్యారు. మధ్యవర్తులుగా పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు ఈ చర్చల్లో ఉన్నారు. ఈ చర్చలకు ముందు అమెరికా, ఇరాన్ బృందాలు పాక్ డెలిగేషన్‌తో సమావేశమయ్యాయి. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో ఇరుదేశాల ప్రతినిధులు భేటీ అయ్యి చర్చించారు.
ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సఫలమై పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడుతుందా..? లేక మిడిల్ ఈస్ట్ మళ్లీ మిస్సైళ్లు, బాంబుల మోతతో దద్దరిల్లుతుందా అనేది చూడాలి. ఒకవేళ చర్చలు విఫలమై ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో స్విట్లర్లాండ్లో ఇరాన్, అమెరికా భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“సెట్”, “టైటిల్”, “చర్చలు విఫలమైతే కలలో కూడా ఊహించని రీతిలో దాడులు చేస్తం: ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

