పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలను అభినందిస్తాం.. ఆదరిస్తాం.. కానీ రాజకీయాలు వద్దని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ రంగులు వేసుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఎవరో ఆడిస్తే పవన్ ఆడుతున్నారు అంటూ ఫైరయ్యారు.
సోమవారం (జూన్ 22) హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ సాయంత్రం ప్రారంభమైన TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఏపీ ఉపముఖ్యమంత్రిగా అక్కడ మీ సేవలు చేయండి.. మాకు ఇతర రాష్ట్ర నేతల సలహాలు, సూచనలు అవసరం లేదు.. ఇక్కడ మేం రాష్ట్రాన్ని అభివ్రుద్ది చేసుకుంటున్నాం.. అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రామ్ చందర్ రావు రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నారు. దానికి ముందు సమాధానం మీరు చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి.. మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిత్యవసర ధరలు ఎందుకు పెరిగాయి..? 12 ఏళ్లలో ఏ సామాన్యుడు బాగుపడ్డాడా..? రోడ్డున పడ్డాడా.. అంటూ ఫైరయ్యారు.
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చింది.. తన అన్నకు ఎందుకు దూరమైంది.. దోసుకున్న సొమ్ములో వాటాల పంపకాలే కారణం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేళ్లలో ఆర్థిక విజయం.. రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివ్రుద్దిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో BRS పని అయిపోయింది.. తెలంగాణ రాష్ట్రంలో BRS నూకలు చెల్లిపోయాయి అంటూ ఎద్దేవా చేశారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలను అభినందిస్తాం.. కానీ రాజకీయాలు వద్దు: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

