- లక్నో కోచింగ్ సెంటర్లో ఘోర విషాదం
- భారీ అగ్నిప్రమాదంలో 15 మంది చిన్నారులు సజీద దహనం
- విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కోచి సెంటర్లో ఘోర విషాదం సంభవించింది. బిల్డింగ్‌లో అంటుకున్న మంటలు.. క్షణాల్లోనే మంటలు భవనం అంతటా వ్యాపించాయి. దీనితో కోచింగ్ చేస్తున్నారు విద్యార్థులు మంటల్లో కాలి. దాదాపు 15 మంది సజీవ దహనం అయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక ఈ ఘటనపై డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ తీవ్ర దు:ఖానికి సిద్ధమయ్యారు. ప్రాణాలు కోల్పోయిన అమాయకుల పట్ల సంతాపం తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు సంయమనాన్ని కోల్పోయింది.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. ఆద్యంతం కన్నీటి పర్యంతం అయ్యారు. ‘నేను 14 మృతదేహాలను నా కళ్లారా చూశాను.’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు.
జరిగిన సమయంలో యానిమేషన్ కేంద్రంగా పనిచేస్తోందని.. అక్కడ 15, 16, 17 ఏళ్ల పిల్లలు వేసవి సెలవుల్లో కార్టూన్ మేకింగ్, యానిమేషన్ నేర్చుకోవడానికి వచ్చారని డిప్యూటీ సీఎం తెలిపారు.
మంటలు చెలరేగిన వెంటనే పిల్లలు తమను తాము కాపాడుకోవడానికి వెనుక వైపుకు పరుగెత్తారు. ఆ కేంద్రం లోపల చాలా చెక్క వస్తువులు ఉన్నాయి. ఆ మంటల వల్ల వెలువడిన దట్టమైన, విషపూరితమైన పొగను చుట్టుముట్టడంతో వారు బయటకు రాలేకపోయారు. ఇప్పటివరకు 15 మంది పిల్లల మృతదేహాలు లభ్యం కాగా.. వారిలో 14 మందిని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. గాయాలతో ఉన్న పిల్లలను చికిత్స కోసం వెంటనే కేజీకి ట్రామా సెంటర్‌కు చికిత్స.
ఇక ఈ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలీగఢ్‌లో తన షెడ్యూల్ కార్యక్రమాలను రద్దు చేశారు. ఇదిలా ఉంటే ఇదే నెలలో ఢిల్లీ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 12 మంది విదేశీయులు ఉన్నారు.
#చూడండి | లక్నో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అగ్నిప్రమాదం ఘటనపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ మాట్లాడుతూ.. “మొత్తం పదమూడు మంది పిల్లలను ఇప్పుడే బయటకు తీసుకొచ్చారు. అందరినీ ఆసుపత్రికి తరలించారు. ఇది పెద్ద సంఘటన. లోపల పొగలు కక్కుతున్నాయి. ఒక్కో వస్తువు… pic.twitter.com/M8svb1a2FN
– ANI (@ANI) జూన్ 22, 2026
#చూడండి | లక్నో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అగ్నిప్రమాదం ఘటనపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ విరుచుకుపడ్డారు.
“నేను 14 శరీరాలను నా స్వంత కళ్ళతో చూశాను” అని అతను చెప్పాడు. pic.twitter.com/WuLhFpXIUw
– ANI (@ANI) జూన్ 22, 2026
#చూడండి | లక్నో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అగ్ని ప్రమాదం | లక్నోలోని అలీగంజ్‌లో మంటలు చెలరేగిన కోచింగ్ సెంటర్ నుండి మృతదేహాలను తీసుకెళ్తున్నారు.
అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ మరియు ఇతర అధికారులు ఉన్నారు pic.twitter.com/I2adEPtruJ
– ANI (@ANI) జూన్ 22, 2026
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, మృతుల కుటుంబీకులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. pic.twitter.com/u9nKkvd8tp
– ANI (@ANI) జూన్ 22, 2026

