జైంట్ కలెక్టర్ భరద్వాజకు వినతి పత్రం అందజేసిన ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా.
విశాలాంధ్ర ధర్మవరం/పుట్టపర్తి; రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా, జైంట్ కలెక్టర్ భరద్వాజకు వినతి పత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐవైఎఫ్ రాష్ట్ర పిలుపుమేరకు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ డీఎస్సీని విడుదల చేయడానికి మెగా వారు డిమాండ్ చేశారు. పారిశ్రామిక పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరిచారని వారు తెలిపారు. అదనంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3 వేల రూపాయలు, ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, శాఖలో కానీస్టేబుల్ ఎస్సై పోస్టులకు వయోపరిమితిని పెంచాలని కోరారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ భరద్వాజ మాట్లాడుతూ తమ ప్రభుత్వ దృష్టికి వెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని వారు తెలిపారు.

