చెన్నై:
అనంతరం ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సమావేశం సాగింది. ఈ భేటీ సందర్భంగా సంప్రదాయబద్ధంగా బొకేలు, శాలువాలు ఇవ్వడానికి బదులుగా.. ఆ మొత్తాన్ని ముగ్గురు పేద బాలికల చదువు కోసం విరాళంగా ఇస్తున్నట్లు దిల్ రాజ్ ప్రకటించారు.
గతంలో విజయ్ కథానాయకుడిగా దిల్ రాజ్ వారిసు (తెలుగులో వారసుడు) సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజ్ విజయ్ను ప్రత్యేకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం విజయ్, దిల్ రాజ్ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

