పవన్ కళ్యాణ్: తెలుగు, తమిళ భాషల్లో పవన్ కళ్యాణ్ మరియు విజయ్ లకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరిని అభిమానులు కేవలం హీరోలుగా మాత్రమే చూడరు , తమ ఆరాధ్య దైవంగా చూస్తుంటారు. అందుకే వీళ్లిద్దరు రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ప్రభుత్వాలను స్థాపించి, ఒకరు సీఎంగా కొనసాగుతుండగా, మరొకరు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అభిమానులకు వీళ్లిద్దరు ఇచ్చే గూస్ బంప్స్ స్టఫ్ సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. ఇదంతా పక్కన పెడితే విజయ్ తండ్రి చంద్ర శేఖర్ తమిళనాడు లో పెద్ద స్టార్ డైరెక్టర్ అనే విషయం మీకు తెలిసిందే. ఆయన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో చట్టానికి కళ్ళు లేవు , దేవాంతకుడు వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. అదే విధంగా తమిళనాడు లో తన కొడుకు విజయ్ ని హీరో గా పరిచయం చేస్తూ అనేక సూపర్ హిట్ చిత్రాలను కెరీర్ స్టార్ట్ చేసారు.
అయితే ఒకానొక దశలో చంద్ర శేఖర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్స్ మీద వరకు వెళ్లి ఆగిపోయింది అట. ఆ సినిమా మరేదో కాదు ‘సుస్వాగతం’. తమిళంలో తన కొడుకు విజయ్ నటించిన ‘లవ్ టుడే’ అనే చిత్రం ఇది. చంద్ర శేఖర్ ఈ పవన్ కళ్యాణ్ తో చేస్తే చాలా బాగుంటుంది , ఆయనకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చిరంజీవి ని కలిసి కథ వినిపించాడట. అనంతరం చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఇంటికి పిలిపించి ఈ స్టోరీ ని వినిపించాడట. ఆయనకు కూడా తెగ నచ్చేసింది. అయితే ఈ స్వయంగా చంద్ర శేఖర్ తన సొంతంగా నిర్మించాలని అనుకున్నారు. కానీ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ రైట్స్ అమ్మడానికి ఇష్టపడలేదు.
ఇదొక యూనివర్సల్ సబ్జెక్టు అని , తామే ఈ తెలుగు లో స్వయంగా నిర్మిస్తామని చెప్పారట. దీంతో కోపం తెచ్చుకున్న చంద్ర శేఖర్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు ఈ దరించాడట. ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది, ఆయన్ని ఇండస్ట్రీలో ఒక హీరో గా నిలబెట్టింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాడో , యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడో మనందరికీ తెలుసు. అలా కళ్యాణ్ , విజయ్ తండ్రి చంద్ర శేఖర్ పవన్ కాంబినేషన్ లో ఈ క్రేజీ మూవీ మిస్ అయ్యింది.

