విజయవాడ : సాయి కృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజుకు న్యాయస్థానం రిమాండ్ విధించింది
విజయవాడ : సాయి కృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజుకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. వచ్చే నెల 8వ తేదీ వరకూ నాగరాజుకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. వైద్య పరీక్షలను అనంతరం సీఐ నాగరాజును కోర్టు సిట్ అధికారులు హాజరుపరిచారు.
వచ్చే నెల 8వ తేదీ వరకూ…
నిన్న సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు విచారించిన అనంతరం కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో నాగరాజును కీలక నిందితుడిగా సిట్ అధికారులు గుర్తించారు. నాగరాజును కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ అధికారులు న్యాయస్థానంలో పిటీషన్ వేయనున్నారు.
వార్తల సారాంశం – సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజుకు కోర్టు రిమాండ్ విధించింది

