FIFA ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ RCB జెర్సీ: ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్రేజీ సీన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫ్రాన్స్ వర్సెస్ ఇరాక్ జట్ల మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో.. గ్యాలరీలో ఉన్న ఒక అభిమాని ఇండియన్ క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ పేరున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జెర్సీని గాల్లోకి లేపి ప్రదర్శించాడు.
ఫిఫా స్టేడియంలో కింగ్ కోహ్లీ క్రేజ్:
స్టేడియంలో వేలాది మంది ఫుట్‌బాల్ అభిమానుల మధ్య, ఒక సపోర్టర్ కోహ్లీ పేరున్న ఆర్సీబీ జెర్సీని ప్రదర్శించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఫుట్‌బాల్ మెగా టోర్నీని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి ఫ్యాన్స్ వచ్చినప్పటికీ, అక్కడ కూడా కింగ్ కోహ్లీ ఆర్సీబీ జెర్సీతో భారత క్రికెట్ ఉనికిని చాటడం విశేషం. ఈ విజువల్స్ చూసిన స్పోర్ట్స్ లవర్స్.. విరాట్ కోహ్లీ పాపులారిటీకి కేవలం దేశ సరిహద్దులే కాదు, క్రీడల సరిహద్దులు కూడా లేవంటూ కామెంట్లు పెడుతున్నారు. స్పోర్ట్స్ ప్రపంచంలోనే అత్యంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అథ్లెట్లలో కోహ్లీ ఒకరని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
గ్లోబల్ లెవెల్‌కు చేరిన ఆర్సీబీ కల్ట్ ఫాలోయింగ్:
కింగ్ విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌తోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ గడపడంతో, అతను ఆర్సీబీకి ఒక బ్రాండ్‌గా మారిపోయాడు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్సీబీకి ఒక కాల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఫిఫా వరల్డ్ కప్ వంటి గ్లోబల్ స్టేజ్‌పై ఈ రేంజ్ ట్రిబ్యూట్ దక్కడం క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఆధరణ పొందే అవకాశం ఉంది.
🚨FIFA ప్రపంచ కప్ స్టేడియంలోకి ప్రవేశించిన మొదటి భారతీయ జెర్సీ భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడిది కాదు
అది విరాట్ కోహ్లీ 😭🔥 pic.twitter.com/n9yl6oNrfC
— కనిష్క్ (@jeene2yarr) జూన్ 26, 2026

