ఆంధ్రప్రదేశ్:సాయి కృష్ణ కస్టడీ డెత్ కేసులో ముమ్మరమైన సిట్ దర్యాప్తు.సీఐకి సహకరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు,మరొకరు పరారీ.
సీసీటీవీ ఫుటేజ్,కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించిన అధికారులు.మే 6 నుంచి 8 మధ్య సాయి కృష్ణ కస్టడీలో మృతి చెందినట్లు నిర్ధారణ.
ఇప్పటికీ లభ్యంకాని సాయి కృష్ణ ( సాయి కృష్ణ )మృతదేహం,కొనసాగుతున్న గాలింపు.కేసు వివరాల్లోకి వెళితే.
రౌడీ షీటర్ సాయికృష్ణను మే 6న మార్కాపురంలో అదుపులోకి తీసుకుని విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు.అక్కడ అతడిని అక్రమంగా నిర్బంధించి, తీవ్రంగా హింసించడంతో మే 6 నుంచి 8వ తేదీ వరకు కస్టడీలోనే మృతి చెందినట్లు సిట్ తన రిమాండ్ నివేదికలో పేర్కొంది.
అనంతరం సాక్ష్యాలను నాశనం చేసే ఉద్దేశంతో మృతదేహాన్ని మాయం చేశారు,అది ఇప్పటికీ లభ్యం కాలేదని నిరూపించబడింది.ఆ సమయంలో పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ డీవీఆర్లో ఎలాంటి ఫుటేజ్ లభ్యం కాలేదని ఫోరెన్సిక్ విశ్లేషణలో వెల్లడైంది.
మాజీ సీఐ నాగరాజు అరెస్ట్ అనంతరం హెడ్ కానిస్టేబుళ్లు అశోక్,జంగం నాని,అలాగే సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు.వారిపై సిట్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.


