పెద్ది: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇంత పెద్ద హిట్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. ఆ కారణాల్లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా కచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతీ పాటకు కొరియోగ్రఫీ చేసింది ఆయనే. చికిరి చికిరి, రయ్ రయ్ రారా వంటి పాటలు నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాటలకు థియేటర్స్ లో ఆడియన్స్ వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే సినిమా విజయంలో ఇంతటి కీలక పాత్ర పోషించిన జానీ మాస్టర్, ప్రీ రిలీజ్ వేడుక కార్యక్రమంలో కానీ, సక్సెస్ ఈవెంట్స్‌లో కానీ పాల్గొనడం లేదు. రామ్ చరణ్ కి ఎంతో సన్నిహితుడైన జానీ మాస్టర్ , ఎందుకు ఈ ఈవెంట్స్ లో పాల్గొనలేదని అభిమానులు సైతం అడుగుతున్నారు.
జానీని మాస్టర్ ఆహ్వానిస్తే కచ్చితంగా వచ్చేవారు, కానీ మేకర్స్ అంతటి సాహసం చేయలేకపోయారని. ఎందుకంటే జానీ మాస్టర్ పై పోక్సో కేసు ఉంది. యంగ్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ని ఈయన వ్యక్తుల వేధింపులకు గురి చేసారని రెండేళ్ల క్రితం ఈయనపై ఆమె కేసు వేయడం, పోలీసులు కేసు నమోదు చేసి , జానీ మాస్టర్ కోసం గాలించి , బెంగళూరులోని ఒక రిసార్ట్‌లో అరెస్ట్ చేసి దాదాపు నెల రోజుల పాటు రిమాండ్‌లో ఉంచి విచారించడం, కాకుండా వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి పోవడం వంటి సంఘటనలు చూసిన తర్వాత జానీ మాస్టర్ కి భవిష్యత్తు అని అనుకున్నారు. కానీ కట్ చేస్తే రామ్ చరణ్ పిలుపొచ్చింది. దేశం మొత్తం ఊగిపోయే రేంజ్ స్టెప్పులు కంపోజ్ చేసి మరోసారి చరిత్ర సృష్టించారు.
అయినప్పటికి జానీ మాస్టర్ ని పెద్ద ఈవెంట్ కి పిలిస్తే , సినిమాపై లేనిపోనీవు నెగెటివిటీని కొంతమంది అంటారు , ఆ కారణం చేతనే జానీ మాస్టర్ ని ‘పెద్ది’ చిత్రీకరణకు సంబంధించిన ఈవెంట్స్ కి పిలవడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే నెగెటివిటీ వస్తుంది అని తెలిసినప్పుడు , జానీ మాస్టర్ ని ఈ సినిమా కోసం తీసుకోకుండా ఉండాల్సింది, ఆయన చేత పాటలను కంపోజ్ చేస్తే రానటువంటి నెగెటివిటీ, ఈవెంట్స్ కి వస్తే వస్తుందా?, ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

