కోలీవుడ్ నే కాదు.. యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో నింపింది దిగ్గజ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ ( 73 ) హఠాన్మరణం. జూన్ 27న ఆయన గుండెపోటుతో కన్నుమూయగా.. జూన్ 28న ప్రభుత్వ లాంచనాలతో చైన్నైలో అంత్యక్రియలు జరిగాయి. అయితే ఈ విషాద సమయంలో కొందరు ప్రవర్తించిన తీరుపై సినీ నటి రాధికా శరత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన ఎమోషనల్ , ఘాటైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
50 ఏళ్ల బంధం.. కన్నీటి వీడ్కోలు..
భాగ్యరాజ్‌తో తనకున్న 50 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రాధిక భావోద్వేగానికి లోనయ్యారు. ఇది ఒక గొప్ప సృష్టికర్తకు, అద్భుతమైన రచయితకు, నా కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలిచిన నా ప్రాణ స్నేహితుడికి చెప్తున్న చివరి వీడ్కోలు. ఈ వార్త నన్ను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసింది అంటూ ఇన్స్టాగ్రామ్, X వేదికగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.
అంత్యక్రియలా? సర్కస్ కంపెనీనా?
భాగ్యరాజ్ భౌతికకాయాన్ని తీసుకెళ్తున్న సమయంలో కొందరు యూట్యూబర్స్, మీడియా ప్రతినిధులు, పబ్లిక్ ప్రవర్తించిన తీరుపై రాధికా నిప్పులు చెరిగారు. బాధలో ఉన్న కుటుంబ సభ్యుల ముఖాల్లోకి కెమెరాలు పెట్టడం, జూమ్ చేసి కన్నీళ్లను రికార్డ్ చేయడం, సెల్ఫీల కోసం ఆమె ఎగబడటం. మౌనంగా శోకించాల్సిన పవిత్రమైన విషయాన్ని కొందరు సర్కస్‌లా మార్చేశారు.
దర్శకుడు బాక్యరాజ్ అంతిమ ఊర్వలలో జన రద్దీలో విరక్తిగా రాతిగా చేసిన పని#చెన్నై | #దర్శకుడు | #భాగ్యరాజ్ | #రాధిక | #PolimerNews pic.twitter.com/MajQ4801Sr
— Polimer News (@polimernews) జూన్ 28, 2026
వ్యూస్ కోసం, కంటెంట్ కోసం ఇంత దారుణంగా దిగజారుతారా? ఏడుపులను కూడా జూమ్ చేసి చూపిస్తారా? దీనికి అంతం లేదా? అంటూ ఒక హృదయవిదారక వీడియోను షేర్ చేస్తూ రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత్యక్రియల వాహనంలో ఉన్న కుటుంబ సభ్యులను వేధించకుండా నటి సుహాసిని సైతం కెమెరాలను అడ్డుకోవడం ఆ వీడియోలో కనిపించింది. గతంలో భారతీరాజా అంత్యక్రియల సమయంలోనూ ఇలాంటి ఘటన జరిగింది రాధికా గుర్తుచేశారు.
రాధిక శరత్ కుమార్ పరిగెత్తుకుంటూ బెదిరించినా జగ్గడ మొబైల్ మీడియా..#కె.భాగ్యరాజ్ #రిప్ #రాధికవ్స్పాప్స్#మీడియా #trp #నాటకం pic.twitter.com/5dAvjRuYve
— సరస్వతి జాగీర్దార్ 🇮🇳 (@saraswathi1717) జూన్ 28, 2026
కఠిన రూల్స్ కావాలి..
ఈ అంత్యక్రియల ఫోటోగ్రాఫర్స్ సంస్కృతికి చెక్ పెట్టాలని, సెలబ్రిటీల అంత్యక్రియల వద్ద మీడియాకు, పబ్లిక్కు పరిమితులు విధించాలని రాధికా డిమాండ్ చేశారు. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నడిగర్ సంఘం, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను ట్యాగ్ చేస్తూ.. సెలబ్రిటీల అంత్యక్రియల నిర్వహణకు ప్రత్యేక ప్రొటోకాల్స్ తీసుకురావాలన్నారు. చనిపోయిన ఆత్మకు, వారి కుటుంబ ప్రైవసీకి గౌరవం ఇవ్వబడుతుంది. ప్రస్తుతం రాధిక చేసిన ఈ కామెంట్స్ సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
– రాదికా శరత్‌కుమార్ (@realradikaa) జూన్ 29, 2026

