ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ చిత్రం రానుందనే విషయం అందరికీ తెలిసిందే. పురాణాలతో ముడిపడిన కథగా ఇది తెరకెక్కనుంది. ఇందులో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్నారు. అయితే ఈ విషయంలో తాజాగా అధికారిక అప్డేట్ వచ్చేసింది. ఎన్టిఆర్ స్వయంగా ఈ గుర్తింపు. ‘శివుడి కుమారుడు.. పార్వతిదేవికి గర్వకారణం.. దేవ సేనాని.. మరోసారి త్రివిక్రమ్‌తో’ అంటూ ఎన్టీఆర్ ఓ పోస్టర్ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లు కలిసి గతంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా వస్త అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ రిలీజ్ చేసిన పోస్టర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేశ్‌తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక ఎన్టీఆర్‌తో చిత్రం పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
శివుని కుమారుడు.
పార్వతి గర్వం.
ఎటర్నల్ కమాండర్.
మరి, మరోసారి త్రివిక్రమ్‌తో.#NTRxత్రివిక్రమ్ pic.twitter.com/oIW7o4PETu— జూనియర్ ఎన్టీఆర్ (@tarak9999) జూన్ 29, 2026

