టి-20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన భారత్ మహిళ జట్టుకు ఓ శుభవార్త అందింది. 2028లో జరిగే ఒలింపిక్స్‌కు భారత మహిళ జట్టు అర్హత. ఈ మేరకు ఐసిసి, అంతర్జాతీయ ఆఫర్ కమిటీ ధృవీకరించింది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల టి-20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌కి చేరుకోలేకపోయింది. అయితే ఈ టోర్నీలో ఆసియా భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీంతో భారత జట్టు ఒలింపిక్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా కూడా క్వాలిఫై అయ్యాయి. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెలెస్ వేదికగా ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి. 1900లో ఒక్కసారి మాత్రమే ఒలింపిక్స్‌లో భాగమైన క్రికెట్.. 2028లో పునరాగమనం చేయబోతున్న విషయం తెలిసిందే. లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు ఆరు జట్లతో నిర్వహిస్తారు.

