మనతెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిలలో సోమవారం నిర్వహించిన ప్లాట్ల వేలంలో గజానికి సుమారుగా రూ.87,500ల ధర పలికినట్టుగా తెలిసింది. మొదటిరోజు 50 ప్లాట్లు అమ్ముడుపోగా రెండోరోజు మంగళవారం మిగిలిన 50 ప్లాంట్లకు హెచ్ఎండిఏ ఆన్లైన్ వేలం నిర్వహించబడుతుంది. రెండో రోజు వేలం అయిపోయిన తరువాత గజం ధర ఎం తకూ అమ్ముడుపోయిందో తెలియచేస్తామని హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిలలో సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు 100 ప్లాట్లకు హెచ్ఎండిఏ ఆన్లైన్ వేలం నిర్వహిస్తోంది. సర్వే నంబర్ 96/పిలోని 65.37 ఎకరాల భూమిలో అపార్ట్మెంట్లు, ప్రీమియం నివాస స్థలాలను హెచ్ఎండిఏ అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఉత్పత్తి, విద్యుత్, భూగర్భ డ్రైనేజీ, సరఫరా, ఓవర్‌హెడ్ ట్యాంక్, స్టార్మ్‌వాటర్ డ్రైన్లు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు సైతం హెచ్ఎండిఏ కల్పించింది. ఈ దశలో 100 ప్లాట్లను వేలాన్ని సోమ, మంగళవారాల్లో హెచ్ఎండిఏ నిర్వహిస్తోంది.
ఈ వేలంతో రూ.300 కోట్ల ఆదాయం
ఒక్కో ప్లాట్ 300 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండగా కనీస ధరను చదరపు గజానికి రూ.50 వేలుగా హెచ్ఎండిఏ నిర్ణయించింది. ప్రధానకు సులభ అనుసంధానం ఈ లే ఔట్‌కు 100 అడుగుల వెడల్పు ఉన్న ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. పరిసరాల్లో ఆరు 100 అడుగులు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి రేడియల్ రోడ్-7కు సులభంగా చేరుకోవచ్చు. కోకాపేట నియోపోలీస్, విప్ క్యాంపస్‌కు కూడా వెళ్లే అవకాశం ఉంది.ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్-2 సమీపంలో ఉండటం కూడా ఈ లే ఔట్‌కు మరో ప్రధాన ప్రయోజనంగా ఉంది. ఈ లే ఔట్ సమీపంలోని ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలు, హోటళ్లు, ఐసిఎఫ్ఏఐ, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, సిబిఐటి, ఎంజీఐటీ వంటి విద్యాసంస్థలు ఉండటంతో వాటికి మంచి డిమాండ్ వస్తోందని అధికారులు తెలిపారు. ఈ వేలం కోట్ల ద్వారా కనీసం రూ.300 ఆదాయం లభిస్తుందని హెచ్ఎండిఏ ఆశిస్తోంది. ఇప్పటికే మేడిపల్లిలో 63 ప్లాట్ల విక్రయాల ద్వారా రూ.120 కోట్ల ఆదాయం పొందిన హెచ్ఎండిఏ ఇప్పుడు మోకిల ప్లాట్ల వేలంపై దృష్టి పెట్టింది. వేలంలో ప్లాట్లు దక్కించుకున్న వారు 7గా 25 శాతం మొత్తం చెల్లించాలని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మిగిలిన 60 రోజుల్లో చెల్లించే అవకాశం కల్పించారు. వేలం ప్రక్రియ మొత్తం ఎంఎస్టిసి ఈ ఆప్షన్ ప్లాట్‌ఫాం ద్వారా ఆన్లైన్లో జరుగుతోంది.

