విశాల్-అంజలి : హీరోయిన్ అంజలి లేటెస్టుగా విశాల్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. కాలం గడిచిపోతుంది. సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ కొంతమంది వ్యక్తులతో గడిపిన కొన్ని జ్ఞాపకాలు చెక్కుచెదరకుండా, ప్రత్యేకంగా, శాశ్వతంగా నిలిచిపోతాయి. దశాబ్దానికి పైగా సాగిన ఈ దృఢమైన స్నేహం తర్వాత, మనలోని చిన్నపిల్లతనం, అప్పటి మన అల్లరి చేష్టలు, ఇప్పటి మన అల్లరితనం ఎంతో ఆనందాన్నిస్తాయి. ఇది ఇలాగే కొనసాగాలి. మన స్నేహాన్ని ఏది మార్చలేదని మనం వాగ్దానం చేసుకున్నాం కాబట్టి, ఇది తప్పకుండా కొనసాగుతుంది. బోలెడంత ప్రేమతో.. అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

