జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన హైదరాబా ద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ముక్కుకు సర్జరీ కూడా చేయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరారు. ఆయన వెంట సతీమణి అన్నా కూడా వెళ్లారు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండనున్న’ట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎందుకు?
గత కొంత కాలంలో భుజాల’కు సంబంధించిన రొటేటర్ కఫ్ స’మ’స్యతో ప’వన్ కల్యాణ్ ఇబ్బంది పడుతున్నారు. అలానే.. రెండు భుజాలకు సంబంధించిన కండరాలు కూడా చిట్లి పోవడంతో సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రత్యేక ట్రీట్మెంటు అవసరం కావడంతో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్టు ప్రభుత్వ సమాచార శాఖ కూడా ఒక ప్రకటనలో రాష్ట్ర కార్యక్రమం. కాగా.. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని.. మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఓజీ సమయంలో..
పవన్ హీరోగా నటించిన ఓజీ సినిమా షూటింగ్ సమయంలోనే రెండు భుజాలకు గాయాలు అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ భాగంగా కత్తులను వేగంగా తిప్పే క్రమంలో రెండు భుజాలకు గాయాలు అయ్యాయని తెలిసింది. అయితే.. అప్పటి నుంచి మందులు వాడుతున్నా.. లోలోన పెరిగిన సమస్య కారణంగా తాజాగా మరింతగా ఇబ్బంది ఎదురవు తొందని సమాచారం. అందుకే రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించినందున కోకిల బెన్ ఆసుపత్రికి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

